అల్లరి నరేష్ నటిస్తుంది కొరియన్ సినిమాలోనా..!

0

అల్లరి నరేష్ ఈ పేరు వింటేనే మన పెదాలపై చిరునవ్వు చిగురిస్తుంది. ఎందుకంటే అతని సినిమాలలో ఉండే సందడే వేరు. తన కెరీర్ లో అల్లరి సినిమా తో హిట్ మొదటి హిట్ అందుకొని సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. కెరీర్ ప్రారంభమైన కొంతకాలంలోనే తన హావభావాలతో కామెడీ టైమింగ్ తో మంచిపేరును సంపాదించుకున్నాడు.

మంచి కామెడీ మూవీస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని పెద్ద హీరోలకు ధీటుగా నిలబడ్డాడు. కానీ గత రెండేళ్లుగా తన నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. గతేడాది మహర్షి మూవీ లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసాడు తప్ప హీరోగా రాలేదు. ఫ్రెండ్ గా సక్సెస్ అయ్యాడనుకోండి.. కానీ ప్రేక్షకులు ఆశించిన అల్లరి అందులో లేదు. పూర్తి ఎమోషనల్ పాత్రలో కనిపించాడు.

ఇప్పటికి సినీ అభిమానులు అల్లరి నరేష్ నుండి కొత్త సినిమాలను కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న హీరోలలో కామెడీని వంద శాతం పండించే వాళ్ళు లేరనే చెప్పాలి. ఆ మధ్యలో సునీల్ చాలా ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు. ఆఖరికి మళ్లీ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. కానీ అల్లరి నరేష్ ని మాత్రం ఎప్పటికి హీరో లాగానే ప్రేక్షకులు ఆదరిస్తారు.

ఇదిలా ఉండగా ఈ ఏడాది అల్లరి నరేష్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరయిన్ గా ఒక చిత్రం రూపొందుతుందని సినీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కాజల్ కూడా హిట్లు లేక ఖాళీగా ఉండటం ఎందుకని అనుకుందేమో వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకుంటున్నట్లుంది. ఏది ఏమైనా వీరి కలయికనే ఆశ్చర్యానికి గురిచేసిందంటే.. ఆ సినిమా కొరియన్ రీమేక్ ఫిల్మ్ అనేసరికి ఇంకాస్త ఆశ్చర్యానికి గురవుతున్నారు.

కొరియన్ సినిమా డ్యాన్సింగ్ క్వీన్ ను రీమేక్ చేస్తున్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ వారు తెలిపారు. అసలు సంగతేంటో తెలియాలంటే కొంతకాలం ఆగాలి మరి..
Please Read Disclaimer