అల్లరోడి ఫ్యూచర్ ఎలా ఉంటుంది?

0

ఇంకో వారం రోజుల్లో విడుదల కాబోతున్న మహర్షి మీద మహేష్ బాబు ఫ్యాన్స్ గురి ఒక్కటే ఉందనుకుంటున్నాం కానీ ఎంతో కొంత చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్న అల్లరి నరేష్ అభిమానులు కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు . తను చేసింది స్పెషల్ రోలే అయినప్పటికీ ప్రాధాన్యత ఉంటుందని కథను చాలా కీలక మలుపు తిప్పే రీతిలో అతనికి గుర్తుండిపోయేలా సాగుతుందని ఆశిస్తున్నారు. నిజానికి ఇది అల్లరి నరేష్ కు సవాల్ లాంటిది.

మహేష్ బాబు ఉంటె అతని అందం ముందు బుట్టబోమ్మల్లాంటి హీరొయిన్లే ప్రేక్షకుల కంటికి ఆనరు. అలాంటిది అల్లరి నరేష్ తనను తలుచుకునే రేంజ్ లో ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇచ్చుంటాడా అనే సందేహం రావడం సహజం. ఒకవేళ ఇది హీరోతో సమానంగా కాకపోయినా రంగస్థలంలో ఆది పినిశెట్టి తరహలో ముఖ్యమైన పాత్ర అయితే నరేష్ కు వచ్చిన డ్యామేజ్ ఏమి లేదు. అలా కాకుండా ఏ ఫస్ట్ హాఫ్ లో లిమిట్ అయితే మాత్రం ఇబ్బందే

ఇప్పటికే సోలో హీరోగా అల్లరి నరేష్ మార్కెట్ బాగా తేడాగా ఉంది. ఇప్పుడు మహర్షి బ్లాక్ బస్టర్ అయినా అందులో తన ప్రమేయం పెద్దగా లేదనే టాక్ బయటికి వస్తే ఇకపై కూడా అలాంటి ఆఫర్లే వస్తాయి. హీరోగా తీయాలనుకున్న వాళ్ళు వెనుకడుగు వేసే ఛాన్స్ లేకపోలేదు. పైగా చాలా అలోచించి ఇందులో నటించే నిర్ణయం తీసుకున్నానన్న అల్లరి నరేష్ ఆ మాటకు న్యాయం జరిగే స్థాయిలో మహర్షిలో చేసుండాలి.

అటు చూస్తేనేమో మహర్షి పబ్లిసిటీ మొత్తం మహేష్ మయమైపోయింది. ఎక్కడా అల్లరోడి జాడ లేదు. ఈ నేపధ్యంలో విడుదలయ్యాక కాని అల్లరి నరేష్ ఎలాంటి పేరు తెచ్చుకోబోతున్నాడో క్లారిటీ రాదు. కాని ఒక రకంగా మహర్షి అల్లరి నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ కి గైడ్ గా మారే ఛాన్స్ అయితే ఉంది. అది హీరోగానా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానా రిజల్ట్ డిసైడ్ చేస్తుంది
Please Read Disclaimer