మహర్షి కోసం ఆ సినిమాను పక్కన పెట్టాడు

0

అప్పుడెప్పుడో ప్రారంభమైంది అల్లరి నరేష్ హీరోగా ‘బంగారు బుల్లోడు’ సినిమా. ఈ పాటికి సినిమా రిలీజవ్వాలి. స్టార్టింగ్ లో షూటింగ్ చాలా స్పీడ్ గా జరిగింది. కానీ ఆ తర్వాత షెడ్యూల్ గ్యాప్ వచ్చింది. అల్లరోడు ఈ సినిమాను పక్కన పెట్టి ‘మహర్షి’ చేయడమే దీనికి కారణం. అసలే ఆలస్యం అవుతూ వచ్చిన సినిమాను చివరి షెడ్యూల్ లో పక్కన పెట్టేసాడు నరేష్.

ఇందులో నరేష్ చేసిన తప్పేం లేదు. ‘మహర్షి’ వల్ల అతనికి నటుడిగా మరింత పేరొచ్చింది. పైగా పెద్ద సినిమా కూడా. అందుకే నిర్మాత -దర్శకుడికి నచ్చ చెప్పి ‘మహర్షి’ చేసాడు. అయితే ‘మహర్షి’ అయిన వెంటనే కూడా ‘బంగారు బుల్లోడు’ ను ఎందుకో స్టార్ట్ చేయలేదు. కొంత టైం తీసుకున్నాడు. అయితే ఇప్పుడు సినిమాను కంప్లీట్ చేసారు పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కి చేరుకుంది.

ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొన్ని సినిమాల ఫస్ట్ లుక్స్ అలాగే విషెస్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. అల్లరోడు కూడా ‘బంగారు బుల్లోడు’ రిలీజ్ అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ వదిలాడు. నవంబర్ లో దీపావళి కానుకగా సినిమా రిలీజ్ అంటూ ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే ఆలస్యం అనుకుంటే మళ్లీ ఓ మూడు నెలలు వెనక్కేసారు. ఈ గ్యాప్ లో రీ షూట్స్ ఏమైనా చేస్తారేమో..
Please Read Disclaimer