అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు’ టీజర్

0

– పూజా జవేరి జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘బంగారు బుల్లోడు’. పి.గిరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. నేడు అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ‘బంగారు బుల్లోడు’ మూవీ టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్ చూస్తుంటే నరేష్ మరోసారి తనదైన కామెడీతో రాబోతున్నాడని తెలుస్తోంది. ఇక ఈ టీజర్ లో కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. సినిమాలో కమెడియన్స్ అందరూ ఈ చిత్రం పూర్తి వినోదభరితంగా ఉండబోతోందని అర్థమవుతుంది.

పల్లెటూరి వాతావరణంలో రూపొందిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించనున్నాడు. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు నగలని తమ అవసరాల కోసం వాడుకొని తిరిగి బ్యాంకులో పెట్టే ఉద్యోగులతో కామెడీ సన్నివేశాలతో ఈ టీజర్ నిండిపోయింది. ‘బంగారు బుల్లోడు’ అనే టైటిల్ కూడా అందుకే పెట్టారేమో. తనికెళ్ళ భరణి పోసాని కృష్ణ మురళి ప్రవీణ్ పృథ్వీ రాజ్ సత్యం రాజేష్ వెన్నెల కిశోర్ ప్రభాస్ శ్రీను జబర్దస్త్ మహేష్ ఆచంట తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ‘బంగారు బుల్లోడు’ చిత్ర టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా ఈ చిత్రానికి సాయి కార్తీక్ మ్యూజిక్ అందించారు. ‘బంగారు బుల్లోడు’ సినిమాని ఎప్పుడో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే కరోనా వచ్చి అన్ని ప్లాన్స్ తారుమారు చేసింది. ఇక ఇప్పటికే అల్లరి నరేష్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ‘నాంది’ టీజర్ కు కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గత కొన్నాళ్లుగా సోలో హిట్ కోసం ట్రై చేస్తున్న అల్లరోడుకి ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందించేలా కనిపిస్తున్నాయి.
Please Read Disclaimer