అల్లరోడు నవంబర్ మిస్సయినట్టేగా ?

0

అప్పుడెప్పుడో ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది అల్లరి నరేష్ నటించిన ‘బంగారు బుల్లోడు’. నందిని నర్సింగ్ హోమ్ ఫేమ్ పివి గిరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మొదలై దాదాపు ఏడాది పైనే దాటింది. అయినా ఇంత వరకూ రిలీజ్ కి నోచుకోలేకపోతుంది.

నిజానికి మహర్షి సినిమా ఆఫర్ రావడంతో ఈ సినిమాను పక్కన పెట్టాడు నరేష్. అయితే అప్పటి నుండి ఈ సినిమా షూటింగ్ ఎందుకో ముందుకు సాగట్లేదు. ముఖ్యంగా నాలుగు రోజులున్న ప్యాచ్ వర్క్ కూడా జరగట్లేదు. మొన్నీ మధ్య నవంబర్ రిలీజ్ అంటూ ఓ పోస్టర్ వదిలారు. కానీ నిర్మాత అనిల్ సుంకర ఇప్పుడు మహేష్ సినిమా బిజీలో పడిపోయి బంగారు బుల్లోడు ని పక్కన పెట్టారని తెలుస్తుంది.

అయితే ప్యాచ్ వర్క్ జస్ట్ నాలుగు రోజులు దృష్టిలో పెట్టుకొని అలా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా నవంబర్ లో రిలీజ్ అనేది కష్టమే. ప్యాచ్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా బ్యాలెన్స్ ఉంది. ప్రమోషన్స్ కి కూడా టైం కావాలి కాబట్టి డిసెంబర్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఒక వేళ డిసెంబర్ మిస్సయితే ఇక సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చ్ కి వెళ్లాల్సిందే. మరి నిర్మాత అనిల్ సుంకర సినిమాను ఎప్పుడు బయటికి వదులుతారో…Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home