అల్లరి నరేష్ ‘నాంది’ టెర్రిఫిక్ లుక్…!

0

అల్లరి నరేష్ తన పంథా మార్చుకొని నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం ‘నాంది’. ఈ సినిమాతో విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న ఎస్.వీ 2 ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అల్లరి నరేశ్ కెరీర్లో 57వ చిత్రంగా రూపొందిన ‘నాంది’ – ఎ న్యూ బిగినింగ్’ సామాజిక అంశాలతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇప్పటి వరకు కామెడీ చిత్రాలతో అలరించిన అల్లరి నరేష్ తన శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ కథనాలతో ఈ సినిమా ఉండబోతోంది. ఇటీవల ప్రభుత్వం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇవ్వడంతో దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టారు.

కాగా ఇప్పటికే విడుదలైన ‘నాంది’ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పోస్టర్ లో అల్లరి నరేష్ ఒంటి మీద దుస్తులు లేకుండా గాయాలతో తల కిందులుగా వేళాడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్టుగా జూన్ 30న ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ చేయబోతున్నట్లు అల్లరి నరేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ”జూన్ 30 మంగళవారం – మీరందరూ ‘నాంది’ యొక్క ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ చేయడానికి సాక్ష్యంగా నిలవండి” అంటూ ట్వీట్ చేసారు. ఈ పోస్టర్ లో అల్లరి నరేష్ ఒంటి పై నూలు పోగు లేకుండా నగ్నంగా తన రెండు చేతులను తల వెనుక పెట్టి పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఉన్నాడు. ఈ పోస్టర్ లో అల్లరి నరేష్ టెర్రిఫిక్ లుక్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగేలా చేసింది. జూన్ 30న రాబోయే ఎఫ్.ఐ.ఆర్ (ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్) కోసం ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ – హరీష్ ఉత్తమన్ – ప్రియదర్శి – ప్రవీణ్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా కోసం ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. సిద్ జే సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి చోటా కె. ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేసారు. ఇక ‘నాంది’ చిత్రానికి ప్రముఖ రచయితా అబ్బూరి రవి సంభాషణలు అందించారు.
Please Read Disclaimer