మెగా హీరోలకు బాస్ అరవింద్ 2020 కానుకలు

0

బాస్ అల్లు అరవింద్ బిజినెస్ స్ట్రాటజీ.. మాస్టర్ మైండ్ గురించి తెలిసిందే. వారసులిద్దరితో గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమాలు నిర్మిస్తున్న అరవింద్ `రామాయణం 3డి`ని ట్రయాలజీగా రూపొందించే ప్రణాళికల్లో ఉన్నారు. ప్రస్తుతం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థతో కలిసి `అల వైకుంఠపురములో` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బన్ని కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజవుతోంది.

ఓవైపు భారీ చిత్రాల్ని భాగస్వాములతో కలిసి నిర్మిస్తూనే.. యువహీరోలతోనూ జీఏ 2 సంస్థలో బన్ని వాస్ తో కలిసి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్ని నిర్మిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ ని `పిల్లా నువ్వు లేని జీవితం` చిత్రంతో తెరకు పరిచయం చేసిన బాస్ ఇప్పుడు `ప్రతి రోజు పండగే` చిత్రంతో మరో ఛాన్స్ ఇచ్చారు. మారుతి దర్శకత్వంలో జీఏ2 బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 20న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అరవింద్ మరోసారి మెగా మేనల్లుడికి బ్రేక్ ఇస్తారనే అంచనా వేస్తున్నారు.

ఈ సినిమా తర్వాతా అరవింద్ తాజా ప్రణాళికల్ని వెల్లడించారు. 2020లో సాయి తేజ్ హీరోగానే మరో సినిమాని నిర్మించనున్నామని ప్రకటించారు. దాంతో పాటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తామని తెలిపారు. గీతా అధినేతకు వరుణ్ తేజ్ తో తొలి చిత్రమిది. కొత్త సంవత్సరంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అంటే మెగా హీరోలకు అల్లు అరవింద్ 2020లో ప్రవేశిస్తున్న సందర్భంగా కొత్త సంవత్సర కానుకల్ని అందిస్తున్నారన్నమాట.
Please Read Disclaimer