నాలుగో కొడుక్కి ఆస్తి రాసిస్తే ఆ ముగ్గురు?

0

బాస్ అల్లు అరవింద్ ఛమత్కారం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవజ్ఞుడైన ఆయన తమపై వచ్చే గాసిప్స్ పైనా అంతే ఛమత్కారంగా స్పందించగలరు. పంచ్ లు విసిరి నవ్వించేయగలరు. అలాంటి అరుదైన సన్నివేశమే అక్కడ ప్రత్యక్షమైంది. తాజాగా ప్రతిరోజూ పండగే సక్సెస్ ఈవెంట్లో ముచ్చటించిన అరవింద్.. తనపై తానే పంచ్ లు వేసుకుంటూ నవ్వులు కురిపించారు.

అసలింతకీ అల్లు అరవింద్ వారసులు ఎంత మంది అంటే.. నలుగురు కొడుకులు అంటూ ఛమత్కారంగానే చెప్పారు. ఇంతకీ ఎవరా నలుగురు.. తెలిసింది ఇద్దరే కదా.. హీరోలు బన్ని.. శిరీష్ అందరికీ తెలుసు. అయితే పెద్ద కొడుకు బాబీ గురించి ఇటీవలే తెలిసింది. బాబీ నిర్మాతగానూ మారుతూ ఇప్పుడు ఇండస్ట్రీలో ఓపెన్ అవుతున్నారు. ఇక ముంబై యోగా టీచర్ ని పెళ్లాడిన వార్తలు హైలైట్ అవ్వడంతో అతడు బాగా తెలిసాడు. మరి నాలుగో కొడుకు ఎవరై ఉంటారు? అంటే.. అల్లు వారి చమత్కారం అంతే మురిపించింది.

గీతా ఆర్ట్స్ 2 బాధ్యతలు చూస్తున్న బన్ని వాస్ తనకు నాలుగో కొడుకు అట. బన్ని వాస్ ఈ బ్యానర్ లో వరుస హిట్లు ఇస్తున్నాడు. `ప్రతిరోజూ పండగే` చిత్రంతో మరో క్లాసీ హిట్ ని అందించాడు. అల్లు అరవింద్ కు బాగానే లాభాలు తెచ్చిపెట్టాడు. అందుకేనేమో బాస్ సక్సెస్ వేదికపై ఎంతో ఇదయ్యారు. తనకు బన్నీ వాస్ కూడా కొడుకు లాంటి వాడే అని.. నాకు వీడితో కలిపి నలుగురు కొడుకులు!! అని అన్నారు. నేను ఇలా అన్నప్పుడల్లా ఆస్తులు ఎక్కడ రాసిస్తానేమో అని ముగ్గురు కొడుకులు భయపడుతుంటారని పంచ్ విసిరి నవ్వించారు. ఇప్పటికే అరవింద్ ఆస్తుల్ని పంపకాలు చేసేశారన్న ప్రచారం ఉంది. మరి ఇప్పుడు నాలుగో కొడుకు వల్ల తనకు వచ్చిన ఇబ్బందేం లేదేమో!!
Please Read Disclaimer