చూస్తే చాలదు.. ఛాన్స్ ఇవ్వండి అల్లు గారు

0

తెలుగు స్టార్ నిర్మాత అల్లు అరవింద్ ఫేస్ బుక్.. ట్విట్టర్ వంటి వాటికి కాస్త దూరంగా ఉంటారని మెగా ఫ్యామిలీ సన్నిహితులు అంటూ ఉంటారు. వాటికి దూరంగా ఉండే అల్లు అరవింద్ ప్రముఖ సోషల్ మీడియా యాప్ అయిన టిక్ టాక్ ను చాలా రెగ్యులర్ గా ఫాలో అవుతారట. రోజులో కనీసం కొంత సమయం అయినా టిక్ టాక్ వీడియోలను చూసేందుకు అల్లు అరవింద్ సమయం కేటాయిస్తారట. ఎప్పుడు బిజీగా ఉండే ఒత్తిడికి గురైనప్పుడు రిప్రెష్ నెస్ కోసం టిక్ టాక్ వీడియోలు చూస్తారట.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా టిక్ టాక్ కు యమ క్రేజ్ ఉంది. తక్కువ సమయంలో ఇంత పాపులర్ అయిన సోషల్ మీడియా సంస్థ మరేది లేదు. ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన ఫేస్ బుక్ ను కూడా ప్రస్తుతం టిక్ టాక్ పక్కకు నెట్టేసింది. సెలబ్రెటీలు ఎక్కువగా ఉండే ఇన్ స్టాను కూడా సైడ్ చేసి టాప్ ప్లేస్ లో టిక్ టాక్ ఉంది. భాష.. చదువు ఇలా దేనితో సంబంధం లేదు. ఎవరైనా టిక్ టాక్ ను చూడవచ్చు. అందుకే అత్యధికంగా టిక్ టాక్ డౌన్ లోడ్స్ అయ్యాయి.

అలాంటి టిక్ టాక్ ను సినిమా ఇండస్ట్రీ వారు కూడా చాలా ఫాలో అవుతున్నారు. ఇప్పటికే టిక్ టాక్ ద్వారా తమ ప్రతిభను చాటుకున్న కొందరికి ఇండస్ట్రీ వారు ఛాన్స్ లు కూడా ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిక్ టాక్ స్టార్ ఒకామె ఏకంగా ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అంతటి ప్రాచుర్యం పొందిన టిక్ టాక్ ను అల్లు అరవింద్ కూడా రోజు చూస్తారని తెలుస్తోంది.

అల్లు అరవింద్ వంటి స్టార్ నిర్మాతలు టిక్ టాక్ లో మంచి ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసుకుని వారికి అవకాశాలు ఇస్తే ఇంకా బాగుంటుందని చూసి వదిలి పెట్టకుండా ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు ఇప్పించడం లేదా ఇవ్వడం వల్ల వారికి సాయం చేసిన వారు అవుతారు అంటూ నెటిజన్స్ కోరుతున్నారు.
Please Read Disclaimer