క్లాస్ పీకడం గ్యారెంటీ ..కానీ !

0

తెలుగులో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వస్తుందంటే ఆ సినిమా దర్శకుడు చివర్లో కుటుంబాలు కలిసి ఉండాలి తల్లి దండ్రులను పక్కనే ఉంటూ చూసుకోవాలంటూ ఓ క్లాస్ పీకడం పక్కా అని ఆడియన్స్ కి అర్థమైపోయింది. అందుకే ఇప్పుడొచ్చే ఫ్యామిలీ సినిమాలకు క్లాసులు పీకుతరేమో అని కొందరు ఆడియన్స్ దూరంగా ఉంటున్నారు.

అయితే ‘ప్రతి రోజు పండగే’ లో కూడా క్లాస్ పీకడం గ్యారెంటీ అంటూ చెప్పేసాడు డైరెక్టర్ మారుతి. తాజాగా మీడియాతో తన సినిమా గురించి చెప్పుకొచ్చిన మారుతి క్లాసులు పీకుతాడేమోనని సినిమాకు వెళ్ళాలా వద్దా అని ఆలోచించొద్దని అన్నాడు. ఇక క్లాస్ పీకడం గ్యారెంటీ కానీ అది మీకు తెలియకుండా చెప్తాను. అంటూ సరదాగా మాట్లాడాడు.

ఇక ఇదే ప్రెస్ మీట్ లో ఫ్రీ మైండ్ తో పనిచేసానన్న మారుతి మాటలకు మూడింతల రెమ్యునరేషన్ తీసుకున్నావ్ కదయ్యా అంటూ అల్లు అరవింద్ ఆటపట్టించాడు. ఏదేమైనా భలే భలే మగాడివోయ్ సాంగ్ షూట్ కి మీడియా ని పిలిచిన మారుతీ మళ్ళీ అదే సెంటిమెంట్ తో మీడియాను సెట్ కి ఇన్ వైట్ చేసి ముచ్చటించాడు.
Please Read Disclaimer