మూడో సినిమా కోసం గీతా వెయిటింగ్

0

గీతా ఆర్ట్స్ లో అవకాశం అంటే అది ప్రతిభ ఉన్నవారికే. ట్యాలెంటు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని అవకాశాలివ్వడం ఈ సంస్థకే చెల్లింది. ఇప్పటికే ఎందరో మెరికల్ని ఏరి పట్టుకున్న గీతా ఆర్ట్స్ సంస్థ.. దాని అనుబంధ సంస్థ జీఏ2 బ్లాక్ బస్టర్ సినిమాల్ని నిర్మించాయి. అలా దొరికిన మెరికనే విజయ్ దేవరకొండ.

అప్పటికే పెళ్లి చూపులు చిత్రంతో నిరూపించుకున్న విజయ్ కి సరిపడే కథను రాసుకుని దర్శకుడు పరశురామ్.. అల్లు అరవింద్ ని మెప్పించి అటుపై `గీత గోవిందం` సినిమా తీశాడు. ఆరంభం అసలు అంచనాలే లేవు. కానీ రిలీజ్ తర్వాత ఈ సినిమా సాధించిన విజయం అన్ని పరిశ్రమల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. విజయ్ క్రేజు ఆల్ సౌతిండియాలో అమాంతం పెంచిన చిత్రమిది. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన టాక్సీవాలా చిత్రం సైతం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ సినిమాని జీఏ2 సంస్థనే నిర్మించింది. వరుసగా రెండు బ్లాక్ బస్టర్లు ఇచ్చారు అల్లు అరవింద్ అండ్ టీమ్.

అందుకే ఇప్పుడు మూడో సినిమా కోసం అల్లు బాస్ ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారట. ఆ విషయాన్ని మరోసారి వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీరిలీజ్ వేడుకలో గుర్తు చేశారు బాస్ అరవింద్. ఈ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేదికపై విజయ్ లోని గొప్ప క్వాలిటీస్ గురించి అల్లు అరవింద్ ఎంతో గొప్పగా చెప్పారు. ట్యాలెంటు.. మంచి మనసు- నిజాయితీ అతడిని ఆ స్థాయికి ఎదిగేలా చేశాయని ప్రశంసించారు. విజయ్ తో తమ బ్యానర్ లో మూడో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని విజయ్ ఓకే అంటే ఆలస్యం లేదని అన్నారు అరవింద్. అయితే విజయ్ మళ్లీ జీఏ2లో సినిమా చేయాలంటే గీత గోవిందం సీక్వెల్ నే చేయాలేమో!
Please Read Disclaimer