డిజిటల్ ఫెయిల్యూర్ పై తట్టుకోలేకనా?

0

అపజయం ఎదురైతే విశ్లేషించుకుని ఆ తర్వాత పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇది సినీపెద్దలు తరచూ చెప్పే మాట. తమ సినిమాల్లో లోపాలేమిటో గ్రహించి అలాంటివి తర్వాతి సినిమాల్లో కానీ.. బిజినెస్ లేదా రిలీజ్ మ్యాటర్స్ లో కానీ ఇలాంటివి రిపీట్ కానివ్వమని చెబుతుంటారు. అయితే అంతటి విశ్లేషకులు కూడా ఒక్కోసారి తప్పటడుగులు వేస్తుంటారు. అందుకే ఇదో మాయా ప్రపంచం అనే చెప్పాలి.

ఇకపోతే గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ డిజిటల్ స్ట్రీమింగ్ వేదికపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆహా పేరుతో ఓటీటీని ప్రారంభించి వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆహాకు ఆశించినంత మైలేజ్ రాకపోవడంతో ఇప్పుడు ప్లాన్ మార్చి.. ప్లాన్ బి- ప్లాన్ సి అంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఆహా ఫెయిలైందన్న వార్తతో అల్లూ వారిలో టెన్షన్ మొదలైంది. దీంతో ప్రచారంలోకి ఏకంగా అల్లు అర్జున్ నే దించేశారు. బన్ని ఓవైపు సినిమాలపై దృష్టి సారిస్తూనే ఇటువైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదొక్కటేనా..? ఆహా విషయంలో వీలున్న ప్రతిదానిని ప్రచారానికి పెట్టేస్తున్నారు.. మా సినిమాకి ఇంత కలెక్షన్స్ వచ్చాయ్.. అంత వచ్చాయ్ అని చెప్పుకున్నట్టు ఆహాకు ఇంతమంది సబ్ స్క్రైబర్స్ వచ్చారు! అన్న ప్రచారం వేడెక్కించేస్తున్నారు. అయితే దీనివల్ల కలిసొచ్చేదెంత? బన్నితో ప్రచారం చేయించినా .. రైట్స్ కొనేప్పుడు కాసులు విదిలించకపోతే కష్టమే. పోటీగా కార్పొరెట్ వెబ్ స్ట్రీమింగ్ సంస్థలు భారీ మొత్తాల్ని వెచ్చిస్తున్నాయి. అంత భారీ మొత్తాల్ని వెచ్చించి రైట్స్ కొని స్ట్రీమింగ్ చేస్తేనే పనవుతుందని విశ్లేషిస్తున్నారు. అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ కి అలవాటు పడ్డాక.. ఆహా కి నెలవారీ వాయిదా కడతారా? అంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఓటీటీపై సక్సెస్ ఎంతవరకూ సాధ్యం? అయినా దీనిని స్టెప్ బై స్టెప్ ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అందుకు చాలా గట్స్ ఉండాలని డిజిటల్ ఎనలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి బాస్ అరవింద్ వీటిని పరిగణనలోకి తీసుకుంటారా? అన్నది చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-