అల్లువారి ఆలోచనంతా ఆహ పైనే ఉందా?

0

ఈమధ్య OTT(ఓవర్ ది టాప్) ప్లాట్ ఫామ్స్ కు ఆదరణ పెరగడంతో చాలామంది ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అల్లు అరవింద్ కూడా ‘ఆహ’ అనే ఓటీటీ యాప్ ను ఇప్పటికే ప్రారంభించారు. క్రేజీ యువ హీరో విజయ్ దేవరకొండతో ప్రమోషన్స్ కూడా చేయించారు. అయితే ఈ యాప్ కు ఆశించినంత స్పందన దక్కలేదని అంటున్నారు. దీంతో మరోసారి ఈ యాప్ ను మరోసారి లాంచ్ చేయబోతున్నారట. ఈ రీ-లాంచ్ ను స్టైలిష్ స్టార్ చేత చేయించాలని భావిస్తున్నారట. అయితే దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.

అంతే కాకుండా అల్లు అర్జున్ తో ఒక యాడ్ ఫిలిం కూడా షూట్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ యాప్ ఫ్రీ కాకపోవడం.. కంటెంట్ కూడా పెద్దగా ఆసక్తికరంగా లేక పోవడంతో స్పందన తక్కువగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యాప్ ప్రమోషన్స్ విషయంలో అర్బన్ ఆడియన్స్ మీదే దృష్టి ఎక్కువగా పెట్టడం.. ట్వీట్ ప్రమోషన్స్ సరిపోతాయనే ఆలోచనలో ఉండడం కూడా ‘ఆహ’ కు ఆదరణ దక్కక పోవడానికి కారణాలని అంటున్నారు.

ఇక కంటెంట్ విషయం లో వచ్చిన ఫీడ్ బ్యాక్ ను ‘ఆహ’ ఓనర్లు గ్రహించారనే సంకేతాలు వెలువడుతున్నాయి. గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో ఇప్పటికే ఎడ్వాన్సులు తీసుకున్న డైరెక్టర్లతో సినిమాల స్థానంలో వెబ్ సీరీస్ లు ప్లాన్ చేయాలని వాటిని ఆహ లో స్ట్రీమింగ్ కు అందుబాటు లో ఉంచాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు వీఐ ఆనంద్.. మారుతి.. శ్రీకాంత్ అడ్డాల లాంటి డైరెక్టర్లకు సమాచారం అందించారనే టాక్ వినిపిస్తోంది. ఏదైతేనేం.. అల్లు వారు ఈ ఓటీటీ యాప్ ను పాపులర్ చేసేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్.. హాట్ స్టార్ తరహాలో కాకపోయినా జీ5 తరహాలో అయినా గుర్తింపు తెచ్చుకునే అది గొప్ప విషయమే. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-