సంక్రాంతి పుంజు పీక కోసి ఇలా అతికించారు

0

అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజైన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోను మెట్రోల్లోనూ క్రేజీగా రిలీజైంది. ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ వసూళ్ల వైపు దూసుకెళుతోంది. ఇక వసూళ్ల సంగతేమో కానీ.. ఈ సినిమా రిలీజ్ కి ముందే అల్లు అర్జున్ ఆర్మీ సందడి మామూలుగా లేదు.

థియేటర్ల ముందు ఫ్లెక్సీలు ..కటౌట్లు కడుతూ సంక్రాంతి సందడిని తెచ్చారు. ఇక బన్ని కి చెందిన భారీ కటౌట్లు అన్ని థియేటర్ల ముందు దర్శనమిస్తున్నాయి. ఓచోట ఇదిగో ఇలా బన్ని కటౌట్ కడుతున్న అభిమానుల సందడి వెర్రెత్తించింది. చేత్తో కోడి పుంజును పట్టుకుని నోట్లో సిగార్ వెలిగించిన బన్ని కటౌట్ ని అత్యంత భారీగా ఏర్పాటు చేశారు ఆ థియేటర్ వద్ద.

చుట్టూ బన్ని అభిమానులు గుమిగూడి చేస్తున్న సందడి పీక్స్ కి చేరుకుంది. ఇక కటౌట్లు కట్టడం అంటే వీజీనా? ఒక్కో ముక్కను ఆర్టిస్టు డ్రాయింగులు వేసి డిజైన్ చేసి రెడీ చేస్తే.. ఆ ముక్కలన్నిటినీ అతికించి పర్ఫెక్ట్ ఫిగర్ వచ్చేలా చేయాలి. దానికోసం భారీగా థియేటర్ల ముందు కలపతో నిర్మాణం చేపట్టి దానిపైకి ఎక్కి పైనుంచి తాళ్లు వేసి లాగి .. అబ్బో ఆ కష్టం మామూలుగా ఏం లేదు. అయినా అభిమానం ఏ పని అయినా చేయిస్తుంది కదా! సోషల్ మీడియా యుగంలోనూ ఈ పిచ్చేమిటో అని తీసిపారేయడానికి లేదు. ఫ్యాన్స్ అంతే. ఫేవరెట్ బరిలో దిగితే ఆమాత్రం రచ్చ రచ్చ చేయాల్సిందే. ఇక ఆ కటౌట్ కట్టేప్పుడు బన్ని హెడ్ ని అతికిస్తున్న ఈ వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. అందుకే సోషల్ మీడియాల్లో జోరుగా వైరల్ అవుతోంది. సంక్రాంతి పుంజు పీక కోసి అతికించడం బావుందండోయ్!

 

View this post on Instagram

 

#alluarjun mania

A post shared by kamlesh Nand (work ) (@artistrybuzz) on
Please Read Disclaimer