తంబీ స్టార్ కామెడీ విలనీ మూవీ కే హైలైట్

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముచ్చటగా మూడవసారి అభిమానుల్ని ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. సంక్రాంతి రేసులో అల వైకుంఠపురములో భారీగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. రేసులో బలమైన పోటీని ఇవ్వబోతున్న ఈ చిత్రంలో తమిళ దర్శకనటుడు సముథిర ఖని విలన్ గా కనిపించబోతున్నారు. అయితే అది సీరియస్ విలనీయా.. కామెడీ విలనీయా అంటే… ఆ రెండో తరహానే అని అర్థమవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ లో సముథిరఖనిని ఉద్దేశించి `మీరు ఇప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కా..` అని ఎమోషన్ కి వెటకారాన్ని జోడించి చెప్పడం చూస్తే సముథిరఖని పాత్ర కామెడీ విలనీని పండించేది గా సూచనలు కనిపిస్తున్నాయి.

సినిమాలో సముథిరఖని- అల్లు అర్జున్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమా కు హైలైట్ గా నిలుస్తాయని ఇందులో మాటల మాంత్రికుడి డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయని అర్థమవుతోంది. అందులో ఓ సీన్ ని చిత్ర మేకర్స్ తెలివిగా ట్రైలర్ లో వదిలినట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఆయనకు తోడు మలయాళ నటుడు జయరామ్- టబు- సుశాంత్- రాజేంద్ర ప్రసాద్- మురళీ శర్మల పాత్రలు కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని.. ప్రతి పాత్ర సినిమాకు బలంగా నిలుస్తుందని చెబుతున్నారు. త్రివిక్రమ్ తన సినిమాల్లో ఎంత చిన్న పాత్ర అయినా దాన్ని బలం గా ఆవిష్కస్తారు. అది తంబీ స్టార్ కి కలిసి రానుందట.

ఈ సినిమాలోని ప్రతి పాత్ర కీలకంగానే వుంటుందనడం లో సందేహం లేదు. త్రివిక్రమ్ మార్కు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో తమన్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ లిస్ట్ లో చేరిపోయి సినిమా విజయాన్ని డిసైడ్ చేసేశాయి. అయితే జనవరి 12న రిలీజ్ అని చెబుతున్న ఈ సినిమా థియేటర్స్ ని బట్టి సర్ ప్రైజింగ్ గా ముందే రావచ్చని ప్రచారం జరుగుతోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-