అల లో ఆ సీన్లు హైలైట్ అంటున్నారే!

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకూ రిలీజ్ అయిన పాటలు యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. సూపర్ హిట్ ఆడియో మాత్రమే కాదు.. ఈ సినిమాలో ఇంకా హైలైట్స్ ఉన్నాయట.

ఈ సినిమాలో తమిళ నటుడు సముద్రకని ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘అల వైకుంఠపురములో’ టీజర్ లో సముద్రకని.. అల్లు అర్జున్ ఎదురుపడే సీన్ భలే పేలింది. సముద్రకని హవభావాలను అనుకరిస్తూ బన్నీ చెప్పే డైలాగ్ అందరికీ నచ్చింది. ఇది జస్ట్ శాంపిలేనట. సినిమాలో సముద్రకని-అల్లు అర్జున్ మధ్య ఇలాంటి కాంబినేషన్ సీన్స్ చాలానే ఉన్నాయట. ఎంతో సీరియస్ యాక్షన్ సీన్లు అయినప్పటికీ బన్నీ ఇచ్చే కౌంటర్లు ఫుల్ కామెడీ పంచుతాయట. ఈ సీన్స్ సినిమాలో హైలైట్ గా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.

సినిమా లో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. జయరామ్.. టబు.. నివేద పేతురాజ్.. సుశాంత్.. నవదీప్.. సునీల్.. రాజేంద్ర ప్రసాద్.. ఇతర కీలక పాత్రల్లో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్.. హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తం గా ఈ సినిమాను నిర్మించారు. ‘జులాయి’.. ‘S/o సత్యమూర్తి’ లాంటి హిట్స్ తర్వాత అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.




Please Read Disclaimer