స్టైలిష్ స్టార్ మిడ్ నైట్ సెలబ్రేషన్స్ ఎక్కడ?

0

మన స్టార్లు అంతా కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ ని డిఫరెంటుగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ – ఉపాసన .. నాగచైతన్య- సమంత జంటలు గోవా బీచ్ సెలబ్రేషన్స్ కి వెళ్లారు. కొందరు విదేశాల్లో ఎగ్జోటిక్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తే.. చాలా మంది స్టార్లు కుటుంబ సమేతంగా ఇళ్లలోనే డిసెంబర్ 31 నైట్ జస్ట్ టైమ్ పాస్ గా కాలక్షేపం చేశారు. మిడ్ నైట్ లో కేక్ లు కట్ చేసి టపాసులు పేల్చి అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

ఇక ఈసారి కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్లారు? అంటే.. ఆయన వైఫ్ స్నేహతో కలిసి బ్యాంకాక్ లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ ఎన్.వై.ఈ పార్టీలో స్నేహ అదిరిపోయే షైనీ పార్టీ గౌన్ లో మెరిసిపోయింది. బన్ని సింపుల్ గా వైట్ షార్ట్ దానిపై టీషర్టుతో కనిపించాడు. బ్యాంకాక్ ఈవెంట్లో ఈ కపుల్ చూపరుల మనసులు దోచిందట. అయితే వీళ్లతో పాటు కిడ్స్ అయాన్- అర్హ వెళ్లారా లేదా? అన్నది తెలీదు.

బన్ని-స్నేహ జంట రెగ్యులర్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ కి సంబంధించి ఏదీ దాపరికం ఉండదు. ఎప్పటిలానే బన్ని తన వ్యక్తిగత పార్టీని ఫ్యాన్స్ కోసం ఓపెన్ గా రివీల్ చేశారు. ఇక సెలబ్ భార్యామణుల్లో అల్లు స్నేహకు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ వేదికలపై బన్ని అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి చూస్తుంటారు. తాజాగా బన్ని పార్టీ ఫోటోలు సోషల్ మీడియాల్లో వైరల్ గా మారాయి. ఇక ఈ సెలబ్రేషన్స్ ముగించి సుక్కూతో అసలైన పార్టీలోకి జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇప్పటికే చిత్తూరు బ్యాక్ డ్రాప్.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమాకి సుక్కూ సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer