మళ్ళీ మొదటికొచ్చిన బన్నీ సుక్కు!

0

క్రియేటివ్ ఫిలింమేకర్ సుకుమార్ ‘రంగస్థలం’ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ – బన్నీ కాంబినేషన్లో గతంలో ‘ఆర్య’.. ‘ఆర్య 2’ సినిమ్నాలు తెరకెక్కాయి. ఈ కొత్త సినిమా బన్నీ – సుక్కు కాంబోలో మూడవ సినిమా కానుంది. ఇక ఈ సినిమా కథ గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.

సుకుమార్ మొదట ఈ సినిమాకు శేషాచలం అడవులలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఒక కథను బన్నీకి వినిపిస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. స్క్రిప్ట్ కూడా రెడీ అయిందట. కానీ తర్వాత బన్నీ మనసు మార్చుకొని ఒక లవ్ స్టొరీ చేద్దామని సుకుమార్ ను కోరాడట. దీంతో సుక్కు ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ స్టోరీని రెడీ చేశాడట. బన్నీకి ఈ లవ్ స్టొరీ కూడా నచ్చిందట. అయితే ఇప్పుడు సీన్ మళ్ళీ మొదటికొచ్చిందట. బన్నీ- సుక్కు ఇద్దరూ మొదట రెడీ చేసిన ఎర్ర చందనం స్మగ్లింగ్ కథతోనే ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ కథ అయితే బన్నీకి కొత్తగా ఉంటుందనే అభిప్రాయంలో ఉన్నారట.

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఎంపికయింది. డిసెంబర్ లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే ప్రయత్నాలలో ఉన్నారని సమాచారం. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home