శేష్ ను మెచ్చుకున్న బన్నీ

0

ఏదైనా చిన్న సినిమా విజయం సాధిస్తే చాలు ఆ టీమ్ కి స్టైలిష్ స్టార్ నుండి ప్రశంసలు కచ్చితంగా ఉంటాయి. ఎన్నో సినిమాలకు అలాంటి అభినందనలు అందించిన బన్నీ ఇప్పుడు ‘ఎవరు’ సినిమా చూసి టీమ్ ను అలాగే అడివి శేష్ ను ప్రత్యేకంగా అభినందించాడు. మర్డర్ మిస్టరీతో తెరకెక్కిన ఎవరు ఊహించని ట్విస్టులు మలుపులతో అమేజింగ్ అనే ఫీలింగ్ కలిగించిందని చెప్పాడు.

ఇన్విజిబుల్ అనే స్పానిష్ సినిమా కంటెంట్ తో తెలుగు తగ్గట్టుగా మార్పులు చేసిన దర్శకుడు రాంజీ తన రైటింగ్ తో మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. బన్నీ కూడా వెల్ రైటింగ్ అంటూ రాంజీ ను డైలాగ్స్ అందించిన అబూరి రవిను మెచ్చుకున్నాడు. రైటింగ్ పాటు టెక్నీకల్ ఎస్పెక్ట్స్ కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయని అన్నాడు.

ఇక చివర్లో అడివి శేష్ గురించి చెప్తూ శేష్ వరుసగా మంచి సినిమాలను డెలివరీ చేస్తూ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడని అలాగే రెజినా- నవీన్ చంద్ర- మురళి శర్మ కూడా మంచి నటన కనబరిచారని తెలుపుతూ పీవీపీ సంస్థకు- సినిమా దర్శకుడు కెప్టెన్ రాంజీ కి సక్సెస్ అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపాడు బన్నీ. ప్రస్తుతం ఎవరు ఇప్పుడిప్పుడే మంచి రెవెన్యూ తో ఊపండుకుంటుంది. ఈ సమయంలో ఇప్పుడు బన్నీ కాంప్లిమెంట్స్ తో సినిమా ఇంకా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది.
Please Read Disclaimer