పెళ్లి తర్వాత స్నేహాను అల్లు అర్జున్ అదొక్కటే అడిగాడట

0

ఆసక్తికర అంశాలకు వేదికగా మారింది అల వైకుంఠపురములో మ్యూజికల్ నైట్ ప్రోగ్రాం. ఈ కార్యక్రమంలో మాట్లాడిన అల్లు అర్జున్.. ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. సినిమాకు సంబంధించిన అంశాలే కాదు.. తన జీవితంలో తీవ్ర ప్రభావితం చేసే తన కుటుంబ సభ్యుల గురించి ఎమోషన్ అయ్యారు. తన మాటల్లో సినిమాకు సంబంధించిన విషయాల్ని చెప్పే కన్నా.. తనతో నిత్యం ఉండే వారి ప్రస్తావనే కాస్త ఎక్కువగా తెచ్చారని చెప్పాలి.

సినిమా వేడుకల్లో చాలామంది హీరోలు తమ భార్యల ప్రస్తావనే తీసుకురాను. కానీ.. అందుకు భిన్నంగా బన్నీ మాత్రం స్నేహ ప్రస్తావన పలుమార్లు తీసుకురావటం ఆసక్తికరం. అంతేకాదు.. తనకు తన తండ్రి ఎంత ఇష్టమో చెప్పే క్రమంలో తన వ్యక్తిగత విషయాన్ని రివీల్ చేశారు.

తనకు కొడుకు పుట్టిన తర్వాత తనకో విషయం అర్థమైందని.. తన తండ్రి ఎంత గొప్పోడో అర్థమైందన్నారు. ఇప్పటివరకూ తన తండ్రికి తాను థ్యాంక్స్ చెప్పలేదని.. ఇప్పుడు చెబుతున్నానని చెప్పారు. తన తండ్రి అంత గోప్పోడ్ని తానెప్పటికీ కాలేనని.. మా నాన్నలో సగం అయితే చాలనేదే తన కోరికగా చెప్పారు.

పెళ్లి తర్వాత తన భార్యను తానేమీ అడగలేదని.. అడిగింది ఒక్కటేనని.. తాను తన తండ్రితోనే ఉంటానని.. తన తండ్రి అంటే తనకంత ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఎంత సాధిస్తే మాత్రం ఏముంది? ఒక తండ్రికి ఇంతకు మించింది ఏముంటుంది? రెక్కలు వచ్చినంతనే ఎగిరిపోవాలనే చాలామందితో పోలిస్తే.. అల్లు అర్జున్ ఎంత గొప్పోడో తన తాజా మాటలు చెప్పేస్తాయని చెప్పాలి. బన్నీ మాటలు వింటే.. అల్లు అర్జున్ లాంటి కొడుకు.. స్నేహ లాంటి కోడలు కావాలని ప్రతి తండ్రి కోరుకుంటాడేమో? అంతేనా.. స్నేహ లాంటి భార్య వస్తే ఎంత బాగుండని తండ్రిని అమితంగా ప్రేమించే ప్రతి అబ్బాయి అనుకోవటం పక్కా.
Please Read Disclaimer