గడ్డం గ్యాంగ్ లో చేరిన బన్నీ

0

సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురంలో’ చిత్ర విజయంతో మంచి ఊపు మీదున్న అల్లు అర్జున్ అదే ఊపుతో సుకుమార్ దర్శకత్వంలో తన కెరీర్లో 20వ మూవీని పట్టాలెక్కించాడు. డైరెక్టర్ సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే మనకు గుర్తొచ్చే సినిమా ‘ఆర్య’. వాస్తవానికి అల్లు అర్జున్కు స్టార్ డమ్ను తీసుకొచ్చిన సినిమా కూడా ఇదే. ఆ తరవాత వీరిద్దరి కాంబినేషన్లో ‘ఆర్య 2’ వచ్చినా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ జతకట్టారు. మైత్రీ మూవీస్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తమిళ హీరో విజయ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మదన్న హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవరుగా కనిపిస్తారని సమాచారం. దీన్ని నిజం చేస్తూ రీసెంట్ గా రిలీజైన్ అల్లు అర్జున్ ఫొటోల్లో గుబురు గడ్డంతో దర్శనమిచ్చాడు.

ఇదిలా ఉండగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా తలపెట్టిన జనతా కర్ఫ్యూకు దేశ ప్రజానీకం చప్పట్లతో సంఘీభావం తెలుపుతూ సాయంత్రం 5 గంటలకు అందరూ ఇంటి గుమ్మం ముందుకు వచ్చి దేశ శ్రేయస్సు కోసం పోరాడుతున్న వైద్యులు అధికారులు కార్మికులు పోలీసులందరికీ కరతాళ ధ్వనులతో తమ మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి చప్పట్లు కొడుతూ ఒక వీడియో పోస్ట్ చేసారు. ఈ వీడియోలో అందరి కళ్ళూ అల్లు అర్జున్ గెట్ అప్ పై పడ్డాయి. ‘అల వైకుంఠపురంలో’ చిత్రంతో సాఫ్ట్ లుక్ లో కనిపించిన బన్నీని గుబురు గడ్డంలో మాస్ లుక్ చూసిన అభిమానులు షాక్ కి గురయ్యారు. సుకుమార్ రంగస్థలంలో రామ్ చరణ్ లుక్ కావాలని బన్నీని కోరినట్లుగా సమాచారం. సినిమా సినిమాకి తన ఆహార్యాన్ని మార్చుకునే బన్నీ ఈ లుక్ లో కూడా అదరగొడతాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-