స్టైలిష్ స్టార్ ఊరమాసు లుక్ వస్తోందోచ్!

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో సుకుమార్ దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రతి సినిమాకు ఓ డిఫరెంట్ గెటప్ లో కనిపించడం స్టైలిష్ స్టార్ కు అలవాటు. ఈసారి కూడా సుకుమార్ సినిమా కోసం అల్లు అర్జున్ అదే రూటు ఫాలో అవుతున్నారని.. విభిన్నమైన గెటప్ లో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.

ఈ సినిమా శేషాచలం అడవులలో ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రధానాంశంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక లారీ డ్రైవర్ పాత్రలో నాటుగా కనిపిస్తాడని సమాచారం. కెరీర్ లో మొదటి సారిగా అల్లు అర్జున్ ఒక మాసు పాత్రలో నాటుగా మోటుగా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో కొత్త గెటప్ కోసం ఇప్పటికే గడ్డం పెంచుతూ ఉన్నారు. త్వరలో సుకుమార్ అల్లు అర్జున్ లుక్ ఫైనలైజ్ చేస్తారని సమాచారం. ఈమధ్యే బయటకు వచ్చిన ఫోటోలో అల్లు అర్జున్ క్యాప్ పెట్టుకుని గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో అల్లు అర్జున్ పొడవాటి జుట్టుతో కనిపించారు. మరి అదే రకమైన లాంగ్ హెయిర్ కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాలి. సుకుమార్ సినిమా లో మొదటి నుంచి చివరివరకూ పొడవాటి గడ్డంతో కనిపిస్తారట.

ఈ సినిమా లో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది దసరా లోపు పూర్తి చేయాలనే ఆలోచన లో ఉన్నారట. ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడం తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-