బన్ని దృష్టిలో ఏకైక రియల్ హీరో

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ ఎమోషనల్ మూవ్ మెంట్ ని అభిమానులు అంత తేలిగ్గి మర్చిపోలేరు. తన డాడ్.. నిర్మాత అల్లు అరవింద్ పై ఎంత ప్రేమ ఉందో `అల వైకుంఠపురములో` ప్రీ రిలీజ్ వేడుకలో రివీలైంది. ఆ క్షణం బన్ని ఎంత ఎమోషనల్ గా ఓపెనయ్యాడో తెలిసిందే. ఒక తండ్రికి కుమారుడి నుంచి అంత కంటే కావాల్సింది ఏం ఉంటుంది? మనసులో దాచుకున్న ప్రేమనంతా ఒకేసారి ఎమోషనల్ గా బయట పెట్టేశాడు బన్ని. అరవింద్ కూడా అంతే ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి అంత గొప్పోడిని ఎప్పటికీ కాలేనని .. కనీసం ఆయనలో సగం కూడా కాలేను అంటూ ఎమోషనల్ గా మాట్లాడి అభిమానుల హృదయాల్ని గెలుచుకున్నాడు. తండ్రిపై బన్ని ప్రేమ అనంతం అని ఆ వేదిక క్లియర్ కట్ గా చెప్పింది.

నేడు (శుక్రవారం) అరవింద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో బన్నీ తనదైన శైలిలో విష్ చేసి తండ్రి హృదయాన్ని మరోసారి టచ్ చేసాడు. హ్యాపీ బర్త్ డే డాడీ.. ఎప్పటికీ నువ్వే నా ఫెవరేట్.. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను!! అంటూ విష్ చేసాడు. తనకు ధైర్యంతో పాటు.. సపోర్ట్ గా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసాడు. ఇంకా నటుడు.. చిన్న కుమారుడు శిరీష్ కూడా తన తండ్రికి బర్త్ డే విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్ డే డాన్ కార్లియోన్. ఎప్పటికీ నువ్వే నా ఫస్ట్ హీరో. నీ మీద నాకెంతో ప్రేమ ఉంది. ఎంతో కృతజ్ఞత ఉంది. ఆ భావాల్ని మాటల్లో చెప్పలేనంటూ ప్రేమను కురిపించాడు శిరీష్.

ఇలా అన్నదమ్ములిద్దరు తమ రియల్ హీరోకి విషెస్ చెప్పడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవ్. మెగా నిర్మాతకి తమ శుభాకాంక్షల్ని తెలియజేసారు. మీరు భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు చేయాలి. కుమారులిద్దరు హీరోలుగా ఉన్నత శిఖరాలను అందుకోవాలంటూ ఆకాక్షించారు. అయితే ఇప్పటివరకూ మెగా కాంపౌండ్ హీరోలెవరూ స్పందించలేదు.
Please Read Disclaimer