ఫ్లాపైన యాప్ కోసం బన్ని ప్రచారమా?

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- గురూజీ త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టిన సంగతి తెలిసిందే.` జులాయి`…`సన్నాఫ్ సత్యామూర్తి`.. `అల వైకుంఠపు రములో` చిత్రాలతో హ్యాట్రిక్ విజయాల్ని అందుకున్నారు ఈ జోడీ. హిట్టు పెయిర్ జాబితాలో బన్ని-త్రివిక్రమ్ పేరు మార్మోగుతోంది. ఇక ఈ జోడీ మరో రెండిటి కోసం కలిసి పని చేయనున్నారని తెలుస్తోంది. అవేంటి? అంటే..

సంక్రాంతి బ్లాక్ బస్టర్ `అల వైకుంఠపురమలో` బన్నీ ఇమేజ్ ని పెంచింది. అతడి మార్కెట్ ని రెట్టింపు చేసిందనడంలో సందేహం లేదు. ఠఫ్ పోటీలో బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల షేర్ వసూళ్లతో బన్నీ ఇమేజ్ ని రెట్టింపు అయింది. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో సుకుమార్ దర్శకత్వం లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే అంతకు ముందే బన్ని మరోసారి గురూజీ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడట. అది దేనికోసం? అంటే..

ఓ యాడ్ షూట్ కోసం అని తెలుస్తోంది. మెగా నిర్మాత అల్లు అరవింద్ `ఆహా` పేరుతో ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ బిజినెస్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఆశించిన రేంజులో సక్సెసవ్వకపోవడం కలవరపెడుతోందట. దీంతో డాడ్ కోసం బన్ని `ఆహా`కు బ్రాండ్ అంబాసిడర్ గా మారనున్నాడట. దానికి సంబంధించిన ఓ ప్రమోషనల్ వీడియాలో బన్నీ నటించనున్నారు. దీనికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారట. ఇలా ఓ యాప్ కు సంబంధించిన ప్రమోషనల్ వీడియో చేయడం బన్నీకి ఇదే తొలిసారి. గతంలో సుకుమార్ దర్శకత్వంలో ఓ యాడ్ ఫిల్మ్ షూట్ లో నటించిన సంగతి తెలిసిందే. సుక్కూతో సినిమా తర్వాత మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలోనే బన్ని నటించే వీలుంది. అల వైకుంఠపురములో సీక్వెల్ ని బన్ని- త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మురుగదాస్ తోనూ బన్ని ఓ చిత్రం సైలెంటుగా మొదలెట్టేశారని ఇటీవల ప్రచారమైంది. మరి దానికి సంబంధించిన క్లారిటీ అప్ డేట్ రావాల్సి ఉంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-