ప్రభాస్ – చరణ్ సైలెంట్ బన్నీ తగ్గట్లేదుగా

0

ఏ హీరోకయినా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చేసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలనే అందరూ కోరుకుంటారు. అయితే బ్లాక్ బస్టర్ ఊహించిన వారికి ఇండస్ట్రీ హిట్ వస్తే ఇక ఆ హీరో ఆనందానికి అవదలుండవు. సరిగ్గా ఇప్పుడు బన్నీ అదే జోష్ లో ఉన్నాడు. ఓ డిజాస్టర్ తర్వాత వచ్చిన సక్సెస్ పైగా నాన్ బాహుబలి రికార్డు కావడంతో ‘అల వైకుంఠపురములో’ సక్సెస్ ను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇండస్ట్రీ లో పార్టీ కల్చర్ ఎప్పటి నుండో ఉంది. ఏ చిన్న సంతోషం వచ్చినా కొందరు హీరోలు పార్టీ ల పేరుతో జల్సాలు చేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ అదే చేస్తున్నాడు. ‘అల వైకుంఠపురములో’ సక్సెస్ పేరుతో వరుస పెట్టి పార్టీలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఓ నాలుగు పార్టీలు జరిగాయి. రెండు ప్రొడక్షన్ నుండి ఇస్తే రెండు పర్సనల్ గా ఇచ్చాడు. ఇవి అఫీషియల్ గా తెలిసినవి. ఇవి కాకుండా ఫ్రెండ్స్ కి తన స్టాఫ్ కి ఓ రెండు గ్రాండ్ పార్టీలు ఇచ్చాడు. ఇప్పటికే బన్నీ పార్టీలు ఆడియన్స్ దాకా చేరాయి.

అయితే ఈ విషయంలో ప్రభాస్ – చరణ్ సైలెన్స్ మైంటైన్ చేసారు. అవును బాహుబలి ప్రాంచైజీ తర్వాత ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. కొన్నేళ్ళ పాటు ఎవరూ టచ్ చేయలేని ఓ అరుదైన గొప్ప రికార్డు నెలకొల్పాడు. కానీ దాన్ని పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. ఇక ‘బాహుబలి’ తర్వాత ‘రంగస్థలం’ తో నాన్ బాహుబలి రికార్డు కొట్టిన రామ్ చరణ్ కూడా సైలెంట్ గా సక్సెస్ ను ఎంజాయ్ చేసాడే తప్ప పార్టీలు గట్రా ఇస్తూ ఎంజాయ్ చేయలేకపోయాడు. సో ప్రభాస్ చరణ్ చేయలేని పని బన్నీ చేస్తూ ఎంజాయ్ చేయడంలో తనే నంబర్ వన్ అని ప్రూవ్ చేసుకున్నాడు.
Please Read Disclaimer