బోయపాటిని పరామర్శించిన బన్నీ

0

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తల్లి బోయపాటి సీతారావమ్మ ఇటీవలే మృతి చెందిన విషయం తెల్సిందే. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. నేడు ఆమె పెద్ద కర్మను బోయపాటి కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లా పెద్దకాకానిలో నిర్వహించారు. అక్కడకు వెళ్లి బోయపాటిని అల్లు అర్జున్ పరామర్శించాడు. బోయపాటి కుటుంబ సభ్యులను పరామర్శించిన బన్నీ కొద్ది సమయం బోయపాటి శ్రీనుతో మాట్లాడాడు.

బోయపాటి సీతారావమ్మ పెద్ద కర్మ సందర్బంగా పెద్ద కాకానికి అల్లు అర్జున్ వెళ్లడంతో అక్కడ పెద్ద ఎత్తున జనాలు పోగయ్యారు. బోయపాటి అక్కడి ఇంటి వద్ద జనాలు భారీగా గుమ్మి గూడారు. బన్నీ వచ్చిన విషయం తెలిసి అభిమానులు అక్కడకు చేరుకోవడంతో కొద్ది సమయం ట్రాఫిక్ జామ్ అయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. దర్శకుడు బోయపాటిని అక్కడకు వెళ్లి బన్నీ పరామర్శించడం అభినందనీయం అంటూ ఫ్యాన్స్ బన్నీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అల్లు అర్జున్ మరియు బోయపాటిల కాంబినేషన్ లో సరైనోడు చిత్రం వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ చిత్రంతో బన్నీకి నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. కెరీర్ లోనే హై ఓల్టేజ్ పాత్రలో బన్నీని బోయపాటి చూపించాడు.