నాన్న దోసె స్టెప్పు గుట్టు చెప్పేసిందే!

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ అల్లరి వేషాల గురించి తెలిసిందే. ఈ క్యూటీ అల్లరి పిడుగు. ఛాన్స్ దొరికితే తాతను నాన్నను బోలెడంత ఏడిపిస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. క్యూట్ అర్హ అల్లరి వేషాల్ని ఇప్పటికే సోషల్ మీడియాల్లో అల్లు అర్జున్ అభిమానులకు షేర్ చేశారు. అటుపై అవి కాస్తా ఫ్యాన్స్ లో వైరల్ గా దూసుకెళ్లాయి.

లేటెస్టుగా అర్హ వీడియో ఒకటి డాడ్ అల్లు అర్జున్ రివీల్ చేశారు. అర్హను డాడ్ అర్జున్ రకరకాలుగా ప్రశ్నిస్తుంటే వాటికి అర్హ లవ్ లీ ఆన్సర్స్ ఇస్తోంది. నాన్న సినిమా పేరేంటి? అని ప్రశ్నిస్తే .. అల వైకుంఠపురములో అని చెప్పింది. అందులో నాన్న ఎల్లో కలర్ జాకెట్ వేసుకుని చేస్తాడు.. అది ఏ సాంగ్ అంటే రాములో రాముల అని చెప్పింది. ఏ స్టెప్ చేస్తాడు? అంటే దోసె స్టెప్ అని చెప్పింది. దోసె స్టెప్ వెయ్ ఒకసారి అని అడిగితే .. ప్రాక్టికల్ గా దోసె వేస్తూ అద్భుతమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది అర్హ.

ఒక రకంగా అల్లు వారి వారసురాలు నటనలో బన్నీనే మించిపోతోంది మరి. ఆ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కి వీరాభిమానులేర్పడడం ఖాయం. ప్రస్తుతం అల్లు వారసురాలు అర్హ క్యూట్ వేషాలు అంతర్జాలంలో జెట్ స్పీడ్ తో దూసుకెళ్లిపోతున్నాయి. ఈ వీడియోని ఫ్యాన్స్ వైరల్ గా షేర్ చేస్తున్నారు మరి. బన్ని నటించిన అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజవుతోంది. ఇంకా రిలీజ్ తేదీ ప్రకటించాల్సి ఉంది. ఇక డాడ్ సినిమాకి అర్హ ప్రచారం బావుంది కదూ?
Please Read Disclaimer