అల్లు వారి అల్లరి పిడుగు బరిలో దిగుతోందహో

0

అవును.. అల్లు వారి అల్లరి పిడుగు బరిలో దిగుతోంది. టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వారసురాలు అల్లు అర్హ తన తొలి ప్రదర్శనకు సిద్ధంగా ఉంది. అల్లు అర్హా ప్రత్యేక కవర్ సాంగ్ లో పెర్ఫామ్ చేయనుందని తెలుస్తోంది.

మణిరత్నం 1990 క్లాసిక్ `అంజలి`లోని క్లాసిక్ సాంగ్ ‘అంజలి అంజలి’ లో కనిపిస్తుంది. బేబీ అర్హా ఈ పాపులర్ సాంగ్ లో బేబీ షామిలిని రిప్రైజ్ చేయబోతోంది. కవర్ సాంగ్ అదిరిపోయే లా వచ్చిందని తెలిసింది.

ఈ పాటకు సినిమాటోగ్రాఫర్ సూర్య తేజ ముసునూరు ఛాయాగ్రహణం అందించారు. అర్హ విజువల్స్ ని అద్భుతంగా తీర్చిదిద్దారని తనని ఎంతో క్యూట్ గా ప్రెజెంట్ చేశారని తెలుస్తోంది.

అల్లు వారసురాలు అర్హ ఆ పాటలో ఎంతో తేలిగ్గా ఎమోషన్స్ ని పలికించిందని తెలిసింది. సహజంగానే అర్హా నృత్యం.. ముఖ కవళికలు.. భావోద్వేగాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. డాడీ వారసురాలిగా అర్హ డ్యాన్సులు చక్కగానే చేస్తోంది. అందుకే ఈ సాంగ్ పై అభిమానుల్లో అంచనాలుంటాయి. అందుకు తగ్గట్టే పాటను బ్రిలియంట్ గా తీర్చిదిద్దారట.

ఒరిజినల్ సాంగ్లో బేబీ షామిలీతో పాటు మాస్టర్ తరుణ్ ఉన్నాడు. తరుణ్ ప్లేస్ లో ఈ పాటలో అల్లు అయాన్ కూడా కనిపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ స్వయంగా ఈ కవర్ సాంగ్ ని ప్రెజెంట్ చేసి ప్రదర్శించనున్నారు.

“అంజలి అంజలి కవర్ సాంగ్ తొలి అడుగులు.. అమాయక కొంటె పిల్ల డ్యాన్సులు.. ఓహ్-చాలా అందమైన క్షణాల్ని మీ ముందుకు తీసుకువస్తున్నాము. అల్లు అర్హ కవర్ సాంగ్ 11:00 గంటలకు విడుదల అవుతోంది“ అని అల్లు అర్జున్ డిజిటల్ బృందం ఒక ప్రకటనలో తెలిపింది. అల్లు వారి వారసుల రాక గురించి తెలిసాక బన్ని అభిమానులు అప్పుడే సంబరాలు చేసుకుంటున్నారు.