ఇంత గ్యాప్ ఎందుకో గుట్టు విప్పేసిన అల్లు అర్జున్

0

యూత్ లో క్రేజ్.. తన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురావాలనే పట్టుదల.. తన స్టైల్ విషయంలో భారీ కేర్ తీసుకునే హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. తన సినిమాలకు మార్కెట్ ఉన్నప్పటికీ ఒక హీరో సినిమా గడిచిన 20 నెలలుగా విడుదల కాలేదంటే ఆశ్చర్యమే. ఎందుకిలా? అన్న ప్రశ్నే కానీ సమాధానం లేని పరిస్థితి.

2018 మే 4న అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ మూవీ రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత సినిమానే లేదు. ఈ నెల 12న అల వైకుంఠపురములో చిత్రం విడుదల కానుంది. ఇంత గ్యాప్ ఎందుకన్న తన ఫ్యాన్స్ ప్రశ్నలకు.. ప్రేక్షకుల సందేహానికి తాజాగా సమాధానం ఇచ్చేశాడు.

తాను ఎందుకింత విరామం తీసుకున్నారని తనను అందరూ అడుగుతున్నారని.. సరైనోడు.. డీజే..నా పేరు సూర్య తర్వాత తనకొక కోరిక కలిగిందని.. ఓసరదా సినిమాను చేయాలనిపించి.. ఎన్ని కథలు విన్నా నచ్చలేదని..అందుకే సినిమాలు చేయలేదని చెప్పారు.

చివరకు త్రివిక్రమ్.. తానూ కలిసి అనుకున్న కథను చేయటానికి ఇంత కాలం పట్టిందన్నారు. తన సినిమా విడుదలలో గ్యాప్ వచ్చిందేమో కానీ.. సంబరాలు చేసుకోవటంలో మాత్రం రాదంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు బన్నీ. ఎంత నచ్చిన కథ కోసమైతే మాత్రం ఇంత విరామం తీసుకోవాలన్న అభిమానుల అసహనాన్ని తన తాజా సినిమాతో ఎంతగా తగ్గిస్తారో చూడాలి. పోన్లే భయ్యా.. గ్యాప్ మీద ఇప్పటికైనా క్లారిటీ ఇచ్చావ్.. అదే పదివేలు.
Please Read Disclaimer