మరో రికార్డు పై కన్నేసిన బన్నీ?

0

‘నా పేరు సూర్య’ తర్వాత గ్యాప్ తీసుకున్న బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ తో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్స్ లోకి రాబోతుంది. రిలీజ్ కి ఇంకా టైం ఉన్నప్పటికీ బన్నీ మాత్రం ప్రమోషన్స్ లో తన స్పీడ్ చూపిస్తూ దూసుకెళ్తున్నాడు.

ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ సింగిల్ కూడా వదిలేసిన స్టైలిష్ స్టార్ ఇప్పుడు మరో సాంగ్ టీజర్ తో రెడీ అయ్యాడు. లేటెస్ట్ గా విడుదలైన ‘సామజవరగమనా’ సాంగ్ ఇప్పటికే మోస్ట్ పాపులర్ సాంగ్ గా మారిపోయింది. యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ తో దూసుకెళ్తోంది.

అయితే మరికొన్ని గంటల్లో విడుదలయ్యే ‘రాములో రాములా’ అనే రెండో సాంగ్ టీజర్ ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందో.. తమన్ బన్నీ కోసం ఎలాంటి బీట్ సాంగ్ కంపోజ్ చేశాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు. సాంగ్ టీజర్ కనుక ఎలాగో ఎక్కువ రీచ్ ఉంటుంది. సాంగ్ తో పాటు విజువల్స్ ఏ మాత్రం ఎట్రాక్ట్ చేసిన సాంగ్ మరో రికార్డు నెలకొల్పడటం ఖాయం.