అల్లరి ‘అల్లు’ గ్యాంగ్

0

ఇదేంటి అల్లు అర్జున్ ఇలా అల్లరల్లరి చేసే బ్యాచ్ తో అలా షికార్లు చేస్తున్నాడు.. అనుకుంటున్నారా? అల్లరి అనేది అల్లు వారింట్లోనే ఉంది. అల్లు అయాన్ – అల్లు అర్హ రూపంలో. ఆ ఇద్దరిని ఎప్పటికప్పుడు లంచ్ లకు – డిన్నర్ లకు షికారు తిప్పాలి. ఔట్ డోర్ లు – విదేశీ వెకేషన్లు అయితే మస్ట్. వీళ్లు ఎక్కడికి వెళ్లినా అక్కడ వీళ్లతో పాటు ఓ పెద్ద గ్యాంగ్ కూడా ఉంటుంది. ఇదిగో ఈ ఫోటో చూస్తే అదే అర్థమవుతోంది. మొత్తం ఫ్యామిలీలో ఉన్న కిడ్స్ అంతా ఓచోట చేరి అల్లరల్లరి చేయాలి. అది కూడా ఔట్ డోర్ వెళ్లి చేస్తే ఆ మజానే వేరు.

అందుకే బన్ని – స్నేహా సమేతుడై ఇలాంటి ప్లాన్ చేశాడన్నమాట. ఇంతకీ ఇక్కడ ఓ ఇద్దరు కిడ్స్ వింత వేషాలు వేస్తున్నారు చూశారా? ఆ ముక్కుకి కాటుక లాంటి పెయింట్ తో మిక్కీ మౌస్ లా మారిపోయారు. అందులో ఒక గడుగ్గాయ్ అల్లు అయాన్ అని చూస్తే తెలిసిపోతోంది. ఇక స్నేహ ఎత్తుకున్నది ఎవరిని? అంటే క్యూట్ అర్హ అన్నమాట.

బన్ని ప్రస్తుతం రిలాక్స్ మోడ్ లో ఉన్నాడు. ఈ గురువారం `అరవింద సమేత` రిలీజైతే – ఇక త్రివిక్రమ్ తో కలిసి కథా చర్చల్లో పాల్గొంటాడనే వార్తలు వినవస్తున్నాయి. ఇప్పటికే విక్రమ్.కె కుమార్ కథకు ఓకే చెప్పకపోవడానికి కారణం ఆల్టర్నేట్ గా త్రివిక్రమ్ వినిపించబోతున్న కథ కోసమేనని అంతా అనుకుంటున్నారు. మరి కొత్త స్క్రిప్టు ఓకే అయితే మళ్లీ యుద్ధరంగంలో బిజీ అయిపోవాల్సి ఉంటుంది. అందుకే ఇలా ఖాళీ సమయాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట.
Please Read Disclaimer