భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

అంతగా కుళ్లుకునేలా ఏం చేసిందని!?

0

గారాల పట్టి అర్హతో అల్లు అర్జున్ టైమ్ పాస్ వ్యాపకం తెలిసిందే. కూతురితో ఖాళీ సమయాల్ని ఫుల్ ఫన్ తో ఎంజాయ్ చేస్తుంటాడు. అర్హ కూడా డాడీని తాతయ్యను ఏడిపిస్తూ.. వయసును మించిన మాటలతో కడుపుబ్బా నవ్వించేస్తుంటుంది. ఆ వీడియోలను బన్ని స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అర్హ ఆగడాల్ని బయట పెట్టేస్తుంటాడు. క్యూట్ అర్హ మాటల్లో మహా ముదురు… బన్నీని మించిన ముదురు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో ఆనందం వ్యక్తం చేస్తుంటారు. ఆ చిలిపి అల్లరి చూసి బన్నీ తెగ పొంగి పోతాడు. సాధారణంగా సెలబ్ వరల్డ్ లో ఇలాంటి వీడియోలు సీక్రెట్ గా ఉంటాయి. కానీ బన్నీ మాత్రం మనసులో ఎలాంటి సంకోచం లేకుండా.. మరో ఆలోచన లేకుండా అభిమానులతో పంచుకుని వాళ్ల ఆనందాన్ని రెట్టింపు చేస్తుంటాడు.

బేసిగ్గా బన్నీ జోవియల్ పర్సన్. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉందే గుణం అతడికి అలంకారం. అందుకే తన ప్రతి సంతోషాన్ని అభిమానులతోనూ పంచుకుంటాడు. తాజాగా కుమార్తె అర్హను చూసి అసూయపడ్డానంటూ ఓ పోస్ట్ పెట్టి షాకిచ్చాడు. ఇంతకీ బన్నీ అంతగా కుళ్లుకునే లా అర్హ ఏం చేసిందంటారు? అంటే అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తోన్న కొత్త చిత్రం `18 పేజీలు` ప్రారంభోత్సవానికి అర్హ తాతయ్య అల్లు అరవింద్ తో కలిసి అతిధి గా వెళ్లింది.

తాతయ్యతో కలిసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చింది. ఈ సన్నివేశం చూసిన బన్నీ తెగ అసూయ పడ్డాడు. బన్నీకి ఇలాంటి అవకాశం రావడానికి 23 పట్టిందని..కానీ అర్హకి మాత్రం చిన్న వయసులో కెమెరా ముందుకొచ్చి క్లాప్ కొట్టేసిందంటూ కుళ్లుకుంటున్నాడు. “ఎంతైనా అదృష్ట వంతురాలు అర్హ“ అంటూ మరోపక్క సంతోషం పట్టలేక పోతున్నాడు. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్- సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే టైటిల్ కి నిఖిల్ అభిమానుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-