పుకార్ల మీద ఫైర్ అయిన బన్నీ

0

పబ్లిక్ కి సినిమాల మీద ఉన్నంత ఆసక్తి ఇంకోదాని మీద ఉండదన్నది వాస్తవం. అందుకే మీడియా సైతం వీటికి సంబంధించిన వార్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కానీ అత్యుత్సాహంతో చేసే కొన్ని ప్రచారాలు తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రమాదం లేకపోలేదు. అలాంటిదే బన్నీ 19 మూవీ విషయంలోనూ జరిగింది. ఇది కాస్తా విపరీత ప్రచారానికి నోచుకోవడంతో బన్నీ స్వయంగా రంగంలోకి దిగినట్టు సమాచారం.

విషయానికి వస్తే ఇటీవలే ఓ పాపులర్ ఇంగ్లీష్ డైలీ ఈ సినిమా గురించి ఆర్టికల్ రాస్తూ అందులో ఏకంగా సినిమా ఫలితాన్ని చెప్పేసింది. మేకింగ్ స్టైల్ ఇన్ సైడ్ టాక్ ని బట్టి చూస్తే ఇది మరో బ్రహ్మోత్సవం తరహాలో రూపొందుతోందని ఏకంగా పేరునే ప్రస్తావించారు. ఇది బన్నీ ఫ్యాన్స్ కే కాదు మహేష్ అభిమానులకు సైతం ఆగ్రహం కలిగించింది. ఎక్కువ సర్కులేషన్ ఉన్న పేపర్ కావడంతో ఇది వైరల్ కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

ఇది కాస్తా తన దృష్టికి వచ్చిన అల్లు అర్జున్ విషయం తెలిసి చాలా సీరియస్ అయ్యాడట. గాసిప్స్ ఎన్ని రాసుకున్నా అందులో అభ్యంతరం లేదు కానీ ఇలా షూటింగ్ లో ఉన్న సినిమా గురించి రిజల్ట్ ని ఎలా ప్రెడిక్ట్ చేస్తారని అంతేకాకుండా ఇంకో హీరోతో పోలిక తెచ్చి ఇద్దరినీ ఇబ్బందిపెట్టడం గురించి తన టీమ్ తో డిస్కస్ చేశాడట. ఇలా ఊరికే ఉంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లీగల్ గా ప్రొసీడ్ అయ్యే విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. నోటీసులు పంపే దిశగా చర్యలు జరుగుతున్నాయట. నిజంగానే షూటింగ్ లో ఉన్న సినిమాల గురించి ఫలితాలు ఊహిస్తూ ఇతర హీరోల సినిమాలతో పోలికలు తేవడం ఎంత మాత్రం హర్షణీయం కాదు.
Please Read Disclaimer