బన్నీ ఇండస్ట్రీలో ఎప్పుడు అడుగుపెట్టాడో తెలుసా?

0

గంగ్రోత్రి సినిమాతో సినిమా ఇండస్ట్రీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు మన అల్లు అర్జున్. ఆ సినిమాలో చూసి ఇతను హీరోనా అన్న వాళ్లందరికీ గట్టి బుద్దిచెబుతూ స్టైలిష్ స్టార్ గా కష్టపడి ఎదిగాడు.

అయితే గంగోత్రి కంటే ముందు బాలనటుడిగా అల్లు అర్జున్ ‘డాడీ’ సినిమాలో నటించాడు. అదే అతడి తొలి చిత్రం అనుకుంటారు. కానీ అంతకుముందే 1985లోనే అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. 1985లో చిరంజీవి హీరోగా వచ్చిన ‘విజేత’ సినిమా ద్వారానే బన్నీ సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాలో చిరంజీవి మేనల్లుడిగా నటించాడు. ఇదే అల్లుఅర్జున్ సినీ రంగ ప్రవేశం చేసిన మొట్ట మొదటి సినిమా..

ఇక ఆ తర్వాత బాల నటుడిగా కమల్ హాసన్ హీరోగా కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వాతిముత్యం’ సినిమాలో కమల్ హాసన్ మనువడిగా నటించి అలరించాడు. ఇదే బన్నీ రెండో సినిమా..

ప్రస్తుతం ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో దక్షిణాదిలో స్టార్ హీరోగా ఎదిగి 200 కోట్ల కలెక్షన్ల క్లబ్ లో చేరాడు. 1985లోనే ఇప్పుడున్న స్టార్ హీరోలందరికంటే ముందే అల్లు అర్జున్ సినీ రంగ ప్రవేశం చేశాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.