స్టార్ హీరోలతో కంటతడి పెట్టిస్తున్న గురూజీ

0

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఏ హీరో పని చేసినా వారితో సన్నిహితంగా మెలుగుతారు. స్టార్ హీరోలు ఎవరూ దీనికి అతీతం కాదు. పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. ఇలా గురూజీతో పనిచేసిన ప్రతి స్టార్ హీరో ఆయనకు క్లోజ్ గా ఉండేవారే. అందుకేనేమో త్రివిక్రమ్ తో కొంతకాలం జర్నీ చేసిన తర్వాత హీరోలు ఎమోషనల్ అవుతారు. మరి గురూజీ వల్లే అలా ఎమోషనల్ అవుతారా లేదా.. అప్పటి పరిస్థితులే ఎమోషనల్ అయ్యేలా చేస్తాయా అనేది తెలియదు కానీ హీరోలు మాత్రం ఏదో ఒక సందర్భంలో ఎమోషనల్ అవుతారు.

‘అరవింద సమేత’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ నాన్నగారు హరికృష్ణను తలచుకుని కంటతడి పెట్టారు. ఎన్టీఆర్ ఎప్పుడూ బ్యాలెన్స్డ్ గా ఉంటారు కానీ ఆ సమయంలో మాత్రం ఎందుకో ఎమోషనల్ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా ‘అల వైకుంఠపురములో’ మ్యూజికల్ కాన్సర్ట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అల్లు అరవింద్ టాపిక్ మాట్లాడుతున్న సమయంలో అల్లు అర్జున్ కంట నీరు కనిపించింది. బన్నీ అంటే ఎనర్జీకి మారుపేరు.. ఇలా పబ్లిక్ ప్లాట్ ఫామ్ లో ఎమోషనల్ కావడం ఇదే మొదటిసారి.

దీంతో త్రివిక్రమ్ సినిమాల్లో నటించిన హీరోలు ఎమోషనల్ కావడం కామన్ గా మారుతోందని.. గురూజీవారి చేత కంటతడి పెట్టిస్తున్నారని కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు. అయినా గురూజీ సినిమాలలో హీరోలే ఎందుకు ఇలా ఎమోషనల్ అవుతున్నారో ఏంటో?
Please Read Disclaimer