‘బాహుబలి’పై బన్నీ కామెంట్స్.. ఇప్పటివరకూ మాట్లాడలేదు ఇప్పుడు చెప్తున్నా!

0

ఎన్ని సినిమాలు వచ్చినా బాహుబలి ముందు.. బాహుబలి తరువాత అన్నట్టుగానే ఇండస్ట్రీలో ట్రెండ్ క్రియేట్ చేశారు దర్శకధీరుడు రాజమౌళి. రెబల్ స్టార్ ప్రభాస్‌తో జక్కన చెక్కిన ‘బాహుబలి’ చిత్రం రెండు పార్ట్‌లు విజయదుందుభి మోగించాయి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా రెపరెపలాడించిన ఘనత ప్రభాస్, జక్కన్నలకే దక్కుతోంది. ఈ స్థాయి విజయాన్ని అందుకున్న ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రంపై ఆసక్తికరకామెంట్స్ చేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

అల వైకుంఠపురములో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ప్రెస్ మీట్

సంక్రాంతి కానుకగా విడుదలై ‘అల వైకుంఠపురములో’ చిత్రం నాన్ బాహుబలి రికార్డ్స్‌ని బీట్ చేసి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో సోమవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ప్రెస్ మీట్‌లో హీరో అల్లు అర్జున్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు చినబాబు, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభాస్ బాహుబలి.. అల్లు అర్జున్ నాన్ బాహుబలి

ఈ సందర్భంగా మీడియా మిత్రులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు అల్లు అర్జున్.. ‘ప్రభాస్ మీరు ఫ్రెండ్స్.. ఆయన బాహుబలి రికార్డ్స్.. మీరు నాన్ బాహుబలి రికార్డ్స్.. మీ ఇద్దరి మధ్య స్పందన ఎలా ఉంది’? అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు అల్లు అర్జున్.

బాహుబలి గురించి మాట్లాడే అవకాశం రాలేదు.. ఫస్ట్ టైం చెప్తున్నా!!

నేను ఎప్పుడూ బాహుబలి గురించి ఇలా పబ్లిక్‌లో మాట్లాడే అవకాశం లభించలేదు. నేను పర్శనల్‌గా ప్రభాస్, రాజమౌళిలతో బాహుబలి సినిమా గురించి మాట్లాడాను తప్ప.. ఇలా పబ్లిక్‌లో ఎప్పుడూ మాట్లాడలేదు. అంత పెద్ద సినిమా చేసిన ప్రభాస్, రాజమౌళిలకు రెస్పెక్ట్ చేయాలి. నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందంగా ఉంది.

ప్రభాస్ మైండ్ సెట్‌కి సలాం.. ఐదేళ్లలో ఏడాదిన్నరే షూటింగ్

ప్రభాస్‌కి ఈ సినిమాకి ఎంత మంచి పేరు వచ్చినా అతను పడిన కష్టానికి ప్రతిఫలం అనుకోవాలి. మిర్చి లాంటి కమర్షియల్ ఫిల్మ్ తరువాత ఐదేళ్లు పాటు మరో సినిమాకి కమిట్ కాకుండా ఒకే సినిమా చేశారు. ఈ ఐదేళ్లలో ఎన్ని కోట్లు సంపాదించుకోవచ్చన్నదాన్ని పక్కనపెట్టడానికి ఎంత మైండ్ సెట్ కావాలి. ఆ ఐదేళ్లలో షూటింగ్ వర్కింగ్ డేస్ మహా అయితే ఏడాదిన్నర మాత్రమే ఉంటుంది.. మిగతా మూడున్నరేళ్లు ఖాళీగానే ఉండాలి.

ప్రభాస్ కష్టానికి ఎంత ఇచ్చినా తక్కువే.. ఈ రెండు టాప్ మోస్ట్ ఫిల్మ్స్

కాని ఒక విషయాన్ని అంతలా నమ్మి ఇంట్లో ఉండటం అంటే చిన్న విషయం కాదు. అతను చేసిన త్యాగానికి ఎంత పేరు వచ్చినా తక్కువే. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అతని మైనపు బొమ్మను పెట్టినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంత కష్టపడే ప్రభాస్‌కి అంత పెద్ద హిట్ వచ్చినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా సినిమా కూడా పెద్ద హిట్ అయినందుకు ఆనందంగా ఉంది. ఈ రెండు సినిమాలు టాప్ మోస్ట్ ఫిల్మ్స్‌గా ఉన్నందుకు వెరీ వెరీ హ్యాపీ’ అంటూ ప్రేక్షకులతో తన ఆనందాన్ని పంచుకున్నారు బన్నీ.
Please Read Disclaimer