సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

గుట్టు లీక్: ‘గజిని 2’ బన్నీతోనేనా?

0

దర్బార్ పంపిణీదారులు తమకు తీవ్ర నష్టాలొచ్చాయంటూ లైకా- మురుగదాస్ బృందంపై యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. నష్టపరిహారం చెల్లించాల్సిందేనంటూ ఆ ఇద్దరిని వెంబడించారు. అయితే ఆ సమయంలో మురుగదాస్ తన ఇంటి వద్ద చిక్కకుండా.. గీతా కాంపౌండ్ లో తేలడం తాజాగా చర్చకొచ్చింది.

ఆయన అల్లు అర్జున్ తో సినిమా చేసే పనిలో బిజీలో ఉన్నారన్న వార్త తొలిగా లీకైంది. అయితే అది షూటింగా.. లేక ప్రీలుక్ టెస్ట్ కోసం బన్నీతో వర్కవుట్ చేయించారా? అన్నదానికి సరైన క్లారిటీ లేదు. అయితే అల్లు అర్జున్ కోసం అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేసిన మురుగదాస్ ప్రస్తుతం ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారన్న టాక్ లీకైంది. అది కచ్ఛితంగా గజిని 2 కోసం సన్నాహకాలు అంటూ ప్రస్తుతం ఫిలింసర్కిల్స్ లో ఊహాగానాలు సాగుతున్నాయి. మురుగదాస్ తో కథా చర్చలు సాగిస్తున్నామని బన్ని చెబుతున్నా.. ఇప్పటికే గజిని 2 స్క్రిప్ట్ లాక్ అయ్యిందన్న గుసగుసా వేడెక్కించేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం `గజిని 2` అనే టైటిల్ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించింది గీతాఆర్ట్స్ కావడంతో ఇది బన్నీకోసమేనంటూ వాడి వేడిగా చర్చ సాగుతోంది. ఇంతకుముందు `గజిని` చిత్రాన్ని మురుగదాస్ తెరకెక్కించారు. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అదే చిత్రాన్ని హిందీలో మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా రీమేక్ చేసి గీతా ఆర్ట్స్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి అరవింద్ మైండ్ లో మురుగదాస్ తో సినిమా చేయాలన్న ఆలోచన ఉంది. అది ఇప్పటికి కార్యరూపం దాల్చుతోంది. గజిని 2 చిత్రాన్ని పాన్ ఇండియా కేటగిరీలో తెరెక్కించే యోచనతోనే అరవింద్ సర్వసన్నాహకాలు చేస్తున్నారని తెలుస్తోంది. బన్నికి తెలుగు- మలయాళం- కన్నడ భాషల్లో మంచి మార్కెట్ ఉంది. తమిళం – హిందీలోనూ రాణించాలంటే ఇలాంటి ఏదో ఒక సెన్సేషనల్ స్క్రిప్టు అయితేనే సాధ్యం. అందుకే గజిని 2పై బన్ని- మురుగదాస్ పూర్తి స్థాయిలో వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బన్ని సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. అది పూర్తయ్యేప్పటికి మురుగదాస్ ప్రీప్రొడక్షన్స్ పూర్తి చేసి వందశాతం స్క్రిప్టుతో రెడీగా ఉంటారట.
Please Read Disclaimer