అల్లు వారసులు భూం భూం భుయామి

0

హాలోవీన్ వేషధారణ.. దాంతో పాటే ఫన్ ని ఆస్వాధించడం సెలబ్రిటీలకు కొత్తేమీ కాదు. ఇటీవల ఇది మరికాస్త అడ్వాన్స్ డ్ గా ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి తమ పిల్లలను అయాన్ అర్హలను ఇదిగో ఇలా మార్చేసి అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు.

కొద్ది రోజుల క్రితం దసరా వేడుకల్లో భాగంగా అల్లు కుటుంబం సెలబ్రేషన్స్ కి సంబంధించిన రకరకాల ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. అయితే అప్పుడు వెలుగు చూడని కొన్ని ఫోటోలు తాజాగా అంతర్జాలంలో కి రిలీజయ్యాయి.

గత రాత్రి స్నేహ ఇన్ స్టాగ్రామ్ లో హాలోవీన్ లో భాగంగా తన పిల్లల అందమైన హర్రర్ అవతారాలను అభిమానుల కోసం షేర్ చేశారు. అర్హా ది నన్ అవతారంలో చాలా అందంగా కనిపించగా… అయాన్ పెన్నీవైస్ గెటప్ ను ధరించాడు. చిత్రంలోని మరో అమ్మాయి అనబెల్లేగా మారిపోయింది.

కిడ్స్ ఈ హారర్ గెటప్పులతో ఎలా భయపెట్టేస్తున్నారో చూశారుగా.. ఫన్నీ కిడ్స్ ఎంతో ముచ్చట గొలుపుతుంటే ఈ ఫోటోల్ని వైరల్ చేసేందుకు బన్ని అభిమానులు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప చిత్రీకరణ కోసం పక్కా ప్రణాళికతో సిద్ధమైన సంగతి విధితమే.