ఆర్య 2 లుక్ కి కంటిన్యూషనా బన్నీ?

0

స్టైలిష్ స్టార్ అన్న బిరుదుకి బన్ని ఓ నిర్వచనం. నటించే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యమైన లుక్ ని చూపిస్తూ కెరీర్ లో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఆర్య.. ఆర్య 2 .. నా పేరు సూర్య.. సన్నాఫ్ సత్యమూర్తి.. అల వైకుంఠపురములో.. ఇలా ప్రతి సినిమాలోనూ ఓ కొత్త లుక్ ని ప్రెజెంట్ చేసి టాలీవుడ్ లోనే మోస్ట్ స్టైలిష్ హీరో అని నిరూపించాడు. తెలుగు సినీపరిశ్రమలోనే అల్లు అర్జున్ స్టైల్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు.

అతడు ఎంచుకునే కాస్ట్యూమ్స్ .. హెయిర్ స్టైల్ .. బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతిదీ స్టైల్ ఐకన్ గా నిలబెట్టాయనే చెప్పాలి. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. ఈ మూవీలోనూ బన్ని డిఫరెంట్ గెటప్పులతో దర్శనమీయనున్నాడు. అందులో ఓ మాస్ రగ్ డ్ రోల్ లో ఎర్రచందనం దొంగ రవాణా చేసేవాడిగానూ కనిపించాల్సి ఉందిట.

దీనికోసం అతడు లుక్ ఛేంజ్ చేసుకునేందుకు చాలానే హార్డ్ వర్క్ చేస్తున్నాడు. తాజాగా అతడు కొత్తలుక్ తో కనిపించి షాకిచ్చాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాల్ వైరల్గా మారాయి. తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి అడవిలో టూర్ కి వెళ్లినట్టే కనిపిస్తున్నాడు బన్ని. షూటింగ్ వాయిదా పడింది కాబట్టి ఇలా గ్రీనరీలో డిఫరెంట్ గా ప్లాన్ చేశాడనే భావించవచ్చు. ఈ ఫోటోలోనే మరొక జంట కూడా సందడి చేస్తోంది. జామాయిల్ తోటలో రెండు జంటలు ముచ్చటగా కనిపిస్తున్నాయ్.

ఇక ఈ లుక్ దేనికోసం? అన్నది బన్నీనే చెప్పాలి. ఈ తరహా మాస్ రగ్గ్ డ్ లుక్ తో ఇంతకుముందు ఆర్య 2లో కనిపించాడు. అందులో ఓ యాక్షన్ సీక్వెన్సులో ఇదే తరహా హెయిర్ స్టైల్ తో రఫ్ గా కనిపిస్తాడు. నవదీప్ ని రౌడీలు చితకబాదాక రౌడీల్ని కొట్టేందుకని వచ్చి ఫస్ట్ ఎయిడ్ కిట్ తో ఇలాంటి గెటప్పులోనే దర్శనమిస్తాడు వెరైటీగా. ఇప్పుడు పుష్ప కోసం అదే గెటప్ ని సుకుమార్ వాడేస్తున్నాడా? ఆ గెటప్ కి కంటిన్యూషనా? అన్నది చూడాలి.