కూతురుతో బన్నీ.. ‘ఓన్లీ వన్స్ ఫసక్’

0

వెండితెరకు స్టైలిష్ స్టార్ అయినా ఆ పాపకు ఆయన తండ్రే.. మనలాగే ప్రేమ అప్యాయతలు ఉంటాయి. కానీ బన్నీలో ఆ ప్రేమ పాళ్లు ఎక్కువే. బన్నీ ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటుందంటారు.. షూటింగ్ స్పాట్ లోనే సందడిగా ఉంటూ ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న బన్నీ అల్లు అర్జున్ ఇక ఇంట్లో ఎంత అల్లరివాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ముఖ్యంగా ఇంట్లో భార్య పిల్లలతో బన్నీ ఆడుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొడుకు ఆయాన్ తో బన్నీ వీడియోలు ఇప్పటికే అలరించాయి. కాగా ఇప్పుడు కూతురుతో బన్నీ చెప్పించిన వైరల్ డైలాగ్ సోషల్ మీడియాను దున్నేస్తోంది.

ప్రస్తుతం నెట్లింట్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చెప్పిన ‘ఓన్లీ వన్స్.. ఫసక్’ అనే డైలాగ్ ఎంతో పాపులర్. ఆ పాటను పేరడీగా చేసుకొని పాటలు టిక్ టాక్ సహా ఎన్నింట్లోనే వాడేస్తుంటారు. అలా పాపులర్ అయిన డైలాగును బన్నీ తన కూతురుతో చెప్పించాడు. తాజాగా ఆయన ఇంట్లో కూతురుతో ఆడుకుంటున్న బన్నీ మోహన్ బాబు డైలాగ్ ‘ఓన్లీ వన్స్ .. ఫసక్ ’ అంటూ చెప్పగా.. ఆయన చిన్నారి కూతురు అర్హ దానికి మసాలా జోడించి చేతిలో ఓ అట్టు పట్టుకొని ‘ఓన్లీ వన్స్ ఫసక్ ’ బన్నీ మెడకోసేస్తున్నట్టు చూపించి మరీ ఔరా అనిపించింది. ఇలా తండ్రి కూతుళ్ల సరదా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక బన్నీ రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ తో మూవీలో నటిస్తున్నాడు. ఇటీవలే పట్టాలెక్కిన ఆ మూవీ పేరు ‘అల.. వైకుంఠపురములో’.. గీతాఆర్ట్స్ హారికా హాసిని క్రియేషన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లోనే బన్నీ ఇలా కూతురుతో పాపులర్ డైలాగ్ ను చెప్పించినట్టు తెలుస్తోంది.1`




Please Read Disclaimer