బన్నీ – సుకుమార్ సినిమాకు ముహూర్తం ఖరారు ?

0

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి బన్నీ- సుకుమార్ సినిమా ప్రారంభం అవ్వాలి. ఆ మధ్య లాంచ్ కోసం ఓ డేట్ కూడా అనుకున్నారు. అయితే మళ్లీ క్యాన్సల్ చేసుకున్నారు. ఇక మొన్న ఆగస్ట్ 15 లాంచ్ చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల మళ్లీ వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు మేకర్స్ మళ్లీ ఓ తేదీను ఖరారు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 22 న ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారని సమాచారం. ఇంకా బయటికి రాలేదు కానీ ఆల్మోస్ట్ ఇదే రోజు లాంచ్ ఖచ్చితంగా ఉంటుందని వినిపిస్తుంది.

నిజానికి మహేష్ తో సినిమా క్యాన్సల్ అయ్యాక సుక్కు బన్నీ కోసం కథను మార్చడానికి కొంచెం టైం తీసుకున్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు కథను పూర్తి చేసి బన్నీ కి కూడా వినిపించడాని సమాచారం. అందుకే సినిమాను లాంచ్ చేస్తున్నారట. లాంచ్ జరిగినా షూట్ కి మాత్రం ఇంకా టైం పడుతుందని అంటున్నారు. మరో పక్క ‘ఐకాన్’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా నడుస్తుంది. ఆ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకురానున్నాడు బన్నీ.

హీరోలను కొత్తగా చూపించి ఫ్యాన్స్ ని ఖుషీ చేసే సుక్కు ఈ సారి బన్నీ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడో..ఎలాంటి లుక్ తీసుకొస్తాడో అని స్టయిలిష్ స్టార్ ఫ్యాన్స్ తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. మరి ‘రంగస్థలం’లో చరణ్ ని చిట్టిబాబు గా చూపించి అందరిచే ప్రశంసలు అందుకున్న క్రియేటీవ్ జీనియస్ ఇందులో బన్నీ ని ఎలా చూపిస్తాడో చూడాలి.
Please Read Disclaimer