బ్లెస్సింగ్ అంటున్న బన్నీ

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈమధ్య తరచుగా వార్తల్లో వ్యక్తి అవుతున్న విషయం తెలిసిందే. మరోసారి అలాంటి సందర్భమే వచ్చింది. అల్లు అర్జున్ తన సినిమాలకు సంబంధించిన విషయాలనే కాకుండా పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో ఎప్పుడూ పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని తన ఇన్స్టా ఖాతా ద్వారా తెలిపారు.

అల్లు అర్జున్ కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నానని.. ‘బ్లెస్సింగ్’ అనేపేరుతో కట్టుకుంటున్న ఈ ఇంటికి భూమి పూజ జరిపామని తెలుపుతూ ఇన్స్టా ఖాతాలో ఒక బ్యూటిఫుల్ ఫోటో కూడా పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో అల్లు అర్జున్.. స్నేహ.. పిల్లలు అయాన్.. అర్హ లు ఉన్నారు. అందరూ కలిసి భూమి పూజ సందర్భంగా ఇటుకలపై తాపీతో తడి సిమెంటు వేస్తూ పోజిచ్చారు. అల్లు అర్జున్ కొంతకాలం క్రితం ఆధునిక వసతులతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆఫీసును నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త ఇంటి భూమి పూజ జరగడంతో ఉమ్మడిగా ఉన్న అల్లు ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి విడిగా ఉంటాడని అంటున్నారు.

ఈమధ్య అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరంగా జరుగుతూ ఉన్నాడనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ‘సైరా’ విషయంలో అలాంటి రూమర్లే రావడంతో ఫైనల్ గా ‘సైరా’ పై స్పందించి ఆ వార్తలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కొత్త ఇంటి నిర్మాణం అనగానే అలాంటి వార్తలే వచ్చే అవకాశం ఉంది.
Please Read Disclaimer