అల్లు హీరో యూట్యూబ్ లోనే సూపర్ స్టార్

0

అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న ‘అలవైకుంఠపురంలో’ చిత్రంలోని సామజవరగమనా.. పాట ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. యూట్యూబ్ లో ఆ పాట సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు 41 మిలియన్ ల వ్యూస్ ను ఈ పాట సొంతం చేసుకుంది. ఇదే సమయంలో 7 లక్షల లైక్స్ ను కూడా యూట్యూబ్ లో దక్కించుకుంది. అత్యధిక యూట్యూబ్ లైక్స్ ను దక్కించుకున్న తెలుగు పాటగా సామజవరగమనా నిలిచింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా ప్రకటించాడు. దీంతో మరోసారి అల్లు అర్జున్ యూట్యూబ్ సెన్షేషన్ గా నిలిచాడు.

ఈ మెగా హీరో నటించే సినిమాలకు ఓపెనింగ్స్ విషయంలో ఎప్పటికప్పుడు నిరాశే మిగులుతుంది. ఇతర హీరోలతో పోల్చితే ఓపెనింగ్స్ విషయంలో వెనుకబడి ఉండే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో సెన్షేషనల్ స్టార్ గా.. ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా మాత్రం గుర్తింపు దక్కించుకుంటున్నాడు. ఫేస్ బుక్.. ట్విట్టర్.. ఇన్ స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియా సైట్లతో పాటు యూట్యూబ్ లో కూడా అల్లు అర్జున్ స్టామినా పలు సార్లు నిరూపితం అయ్యింది.

బన్నీ సరైనోడు చిత్రంతో పాటు దాదాపు అన్ని సినిమాలు కూడా హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ లో పోస్ట్ అయ్యాయి. సరైనోడు చిత్రం హిందీ వర్షన్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. హిందీ సినిమా స్టార్స్ కూడా ఆ వ్యూస్ ను చూసి నోరు వెళ్లబెట్టారు. యూట్యూబ్ లో ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ సూపర్ స్టార్ అనిపించుకుంటూనే ఉన్నాడు. కాని కలెక్షన్స్ విషయంలో మాత్రం వెనుకబడుతున్నారు. మరి అల వైకుంఠపురంలో చిత్రంతో అయినా కలెక్షన్స్ లోటును భర్తీ చేసుకుంటాడేమో చూడాలి.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురంలో చిత్రంను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మొదటి పాట సెన్షేషనల్ సక్సెస్ అవ్వడంతో రెండవ పాటను తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. బన్నీకి యూట్యూబ్ లో ఉన్న క్రేజ్ తో ఆ పాట కూడా రికార్డులను దక్కించుకోవడం ఖాయం అంటు ఆయన అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
Please Read Disclaimer