అల్లు అర్జున్ ఐకాన్ అటకెక్కినట్టేనా?

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా బన్నీ మరో రెండు సినిమాలను గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి సుకుమార్ సినిమా కాగా మరొకటి వేణు శ్రీరాం ‘ఐకాన్’. ఈ రెండు సినిమాలలో సుకుమార్ సినిమా వెంటనే పట్టాలెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రేపే లాంచ్ చేస్తున్నారు.

అయితే వేణు శ్రీరాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కాల్సి ఉన్న సినిమా ‘ఐకాన్’ పరిస్థితి ఏంటి? ఈ సినిమాను బన్నీ పక్కన పెట్టేసినట్టేనని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా స్టొరీలైన్ చెప్పిన సమయంలో బన్నీకి నచ్చిందట.. ఫస్ట్ హాఫ్ కూడా నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ ప్రిపేర్ చెయ్యమని చెప్పాడట. కానీ ఈమధ్యే ఫుల్ నరేషన్ విన్న తర్వాత సెకండ్ హాఫ్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడట. సెకండ్ హాఫ్ వీక్ గా ఉందని.. ఆడియన్స్ ను ఎగ్జైట్ చేయ్యదనే అభిప్రాయానికి రావడంతో ‘ఐకాన్’ ను పట్టాలెక్కించే ఆలోచనను మానుకున్నాడని అంటున్నారు.

‘నాపేరు సూర్య’ తర్వాత అల్లు అర్జున్ స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని.. స్క్రిప్ట్ పూర్తి సంతృప్తినివ్వకపోతే మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తున్నారనే టాక్ ఉంది. వేణు శ్రీరాం స్క్రిప్ట్ కు ప్రస్తుతం అదే పరిస్థితి ఎదురయిందని సరిపెట్టుకోవాలి.
Please Read Disclaimer