ఆ దాడుల్ని ఖండించిన బన్ని

0

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ బిల్లుపై దేశ వ్యాప్తంగా నిరసనలు వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ లో జె.ఎన్. యూ విద్యార్ధుల పై ఘోరమైన దాడిని ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటులు ఖండించారు. దీపికా పదుకొణే నేరుగా విద్యార్ధులను పరామర్శించి ఆ దాడిని ఖండించింది. నల్లదస్తులు ధరించి సంఘీభావం తెలిపింది. అయితే దీపిక తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీపిక చేస్తోంది తప్పు..ఏబీవీపీ ముద్దా? అంటూ ప్రశ్నించి..ఆమె నటించిన చపాక్ సినిమాని బాయ్ కట్ చేయాలని పిలుపు నిచ్చారు.

తాజాగా ఈ దాడిని టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఖండించాడు. ఆయన కథానాయకుడిగా నటించిన అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతోన్న సందర్భంగా పాల్గొంటొన్న ప్రచార కార్యక్కమలో ఆ ఘటనపై స్పందించాడు. నేరుగా జాతీయ మీడియాతోనే తన ఉద్దేశాన్ని పంచుకోవడం విశేషం. విద్యార్ధులపై దాడి తీవ్రంగా కలచి వేసింది. ఇలాంటి దాడులు జరగడం బాధకరం. ఈ వివాదంపై త్వరలో మంచి పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

దాడిని ఖండిచాడు కాబట్టి జెఎన్ యూ విద్యార్ధులని బన్నీ వెనకేసుకొచ్చినట్లే. దీపిక తరహాలో సంఘీభావం ప్రకటించినట్లు గానే కొందరు భావిస్తున్నారు. అయితే సీఏఏ బిల్లు ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో అంతగా లేదు. కాబట్టి పై విమర్శలొచ్చే అవకాశం తక్కుగానే ఉంది. మిగతా దక్షిణాది రాష్ర్టాలైన తమిళనాడు- కేరళ- కర్ణాటకలో మాత్రం అక్కడక్కడా నిరసనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం భగ్గు మంటోన్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer