‘అతి’ మించిన బన్నీ

0

“ఈసారి కొంచెం టైం తీసుకొని ఎక్కువ సేపు మాట్లాడతాను” వేదికలపై బన్నీ రొటీన్ డైలాగ్ ఇది. నిన్న కూడా వచ్చిన గ్యాప్ వల్ల ఎక్కువ సేపే మాట్లాడతాను అంటూ ఏదేదో మాట్లాడి చివరికి తండ్రి తో సెంటిమెంట్ పండించాడు. ఇక నిన్న తీసుకున్న బ్రీక్ గురించి చెప్తాడెమో అని ఊహించారందరూ. కానీ అసలు గ్యాప్ ఇచ్చినట్టు లేదని పిల్లలతో ఆడుకోవడం ఫ్యాన్స్ పోస్ట్ లు చూస్తూ గడిపేసానని చెప్పుకున్నాడు.

ఇక అంత వరకూ బాగానే ఉంది. కానీ ఫ్యాన్స్ కి నిన్న ఓ రాంగ్ మెసేజ్ ఇచ్చాడు బన్నీ. కొందరు అభిమానులు తన మీద ప్రేమతో టాటూ వేయించుకున్నారని అయితే ఒక గొప్ప వ్యక్తి పేరు వేయించుకున్నావ్ రా అంటూ ఇంట్లో వాళ్ళు అన్నాడపడేలా నేను చేస్తా అంటూ ఫ్యాన్స్ కి తెలిపాడు. ఇక పై హీరోగా నెక్స్ట్ లెవెల్ లో ఉంటానని డైరెక్ట్ గానే చెప్పాడు. ఇక అందరికీ ఫ్యాన్స్ ఉంటే ఆర్మీ ఉందని చెప్పుకున్నాడు. నిజానికి ఈ రెండు మాటలు బన్నీ నుండి రావడం కాస్త అతి అనిపించింది.

సంక్రాంతికి అల వైకుంఠ పురములో సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న అన్నీ నెక్స్ట్ సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు. శేషాచలం అటవీ నేపథ్యం లో ఎర్ర చందనం స్మగ్లింగ్ కథతో సినిమా తెరకెక్కనుంది. ఆ సినిమా తర్వాత మురుగదాస్ తో ఓ సినిమా వేణు శ్రీరామ్ తో ‘ఐకాన్’ చేయబోతున్నాడు. ఈ మూడు ప్రాజెక్స్ట్ చూసుకునే బన్నీ శృతిమించడా అనిపిస్తుంది. మరి ఈ సినిమాలు స్టైలిష్ స్టార్ హీరోగా నిజంగానే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయా ? వేచి చూడాల్సిందే.
Please Read Disclaimer