2020లో ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా

0

`నా పేరు సూర్య` రిలీజయ్యాక ఏడాది పాటు ఎంతో తర్జన భర్జన పడిన అల్లు అర్జున్ ఏడాదిన్నర పాటు వేచి చూసిన అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకేసారి మూడు ప్రాజెక్టుల్ని ప్రకటించి షాక్ ఇచ్చారు. తొలిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఏఏ 19 కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ఆ వెంటనే ఏఏ20.. ఏఏ 21 కి సంబంధించిన వివరాలు వెల్లడించి ఊహించని ట్విస్టిచ్చాడు. బన్ని ఒకేసారి మూడు సినిమాలకు శ్రీకారం చుట్టడంతో అభిమానులు చాలానే ఖుషీ అయ్యారు. ప్రస్తుతం త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ జెట్ స్పీడ్ తో పూర్తవుతోంది. దీని తర్వాత ఆదిత్య శ్రీరామ్.. సుకుమార్ తో సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. రెండిటి రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ లేదా నవంబర్ లో ప్రారంభించే వీలుందని తెలుస్తోంది. చిన్నపాటి గ్యాప్ తో ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి కెళతాయి. రెండిటినీ 2020లో రిలీజ్ చేసే అవకాశం ఉందిట. కనీసం ఒక సినిమా అయితే తప్పనిసరిగా వచ్చే ఏడాది రిలీజవుతుంది. ప్రాజెక్ట్ స్కేల్ ని బట్టి ఏఏ 20 (ఐకన్).. ఏఏ21 లలో ఏది ముందు రిలీజవుతుంది? అన్నది వేచి చూడాల్సిందే.

నానీకి ఎంసీఏ లాంటి హిట్ సినిమాని ఇచ్చిన వేణు శ్రీరామ్ ఈసారి బన్ని కోసం పకడ్భందీగా స్క్రిప్టును రాసుకున్నారు. దీనికి `ఐకన్` అనే టైటిల్ ని ప్రకటించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే బన్ని – సుకుమార్ సినిమాని ప్రతిష్ఠాత్మక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులపైనా సాధ్యమైనంత తొందర్లోనే అధికారికంగా మరిన్ని వివరాల్ని వెల్లడిస్తారని తెలుస్తోంది.
Please Read Disclaimer