‘ఐకాన్’ లో యూనిక్ గా బన్నీ

0

అల్లు అర్జున్ గత ఏడాది ఆరంభంలో ‘నా పేరు సూర్య’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మళ్లీ ఇప్పటి వరకు ప్రేక్షకులకు మొహం చూపించలేదు. ఈ ఏడాది బన్నీ సినిమా విడుదల కావడం లేదని తేలిపోయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి బన్నీ ప్రస్తుతం చేస్తున్న త్రివిక్రమ్ మూవీ విడుదల కాబోతుంది. ఇదే సమయంలో బన్నీ తదుపరి చిత్రాలు ఇప్పటికే సుకుమార్ మరియు వేణు శ్రీరామ్ ల దర్శకత్వంలో ఫిక్స్ అయ్యాయి. త్రివిక్రమ్ మూవీ తర్వాత బన్నీ చేయబోతున్న మూవీ ఎవరితో అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ నటించబోతున్న సినిమా ఎప్పుడు ప్రారంభం అయ్యే విషయంలో క్లారిటీ లేదు కాని మెగా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బన్నీ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. బన్నీ కెరీర్ లో ఇప్పటి వరకు కాస్త ఏజ్డ్ వ్యక్తిగా కనిపించలేదు. మొదటి సారి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయబోతున్న ‘ఐకాన్’ మూవీలో మాత్రం బన్నీ నాలుగు పదుల వయసు వ్యక్తిగా కనిపించబోతున్నాడట.

మరో పాత్రలో రెగ్యులర్ లుక్ లో బన్నీ కనిపించబోతున్నాడు. ‘ఎంసీఏ’ చిత్రంతో మాస్ ఆడియన్స్ ను మెప్పించిన దర్శకుడు వేణు శ్రీరామ్ దాదాపు రెండేళ్ల పాటు కూర్చుని ఈ స్క్రిప్ట్ ను సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ పై నమ్మకంతో దిల్ రాజు ఈ చిత్రంను నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ మూవీ పూర్తి అయిన తర్వాత అంటే ఈ ఏడాది చివర్లో బన్నీ.. వేణు శ్రీరామ్ ల కాంబో మూవీ ‘ఐకాన్’ ఎప్పుడు ప్రారంభం అయ్యే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యూనిక్ గెటప్ లో కనిపించబోతున్న బన్నీ ‘ఐకాన్’ తో యూత్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించడం ఖాయంగా ఇప్పటి నుండే ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
Please Read Disclaimer