అందరికి ఫ్యాన్స్ ఉంటే.. అతడికి మాత్రం ఆర్మీ ఉందట

0

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నా.. మిగిలిన వారికి కాస్త భిన్నమైన తీరు బన్నీ అలియాస్ అల్లు అర్జున్ ప్రదర్శిస్తుంటారు. తనకు నచ్చింది నచ్చినట్లుగా చెప్పటమే కాదు.. నచ్చని విషయాల్ని సైతం నిర్మోహమాటంగా చెప్పేసే తీరు ఆయనలో చాలా ఎక్కువే. పొగడాలన్నా.. తెగడాలన్నా బన్నీ తర్వాతే ఎవరైనా.

తాజాగా జరిగిన కార్యక్రమంలో తన అభిమానులకు ప్రమోషన్ ఇచ్చేశాడు అల్లు అర్జున్. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారని.. తనకు మాత్రం ఆర్మీ ఉందని చెప్పిన బన్నీ.. కొత్త చర్చకు తెర తీశారని చెప్పాలి. అల్లు అర్జున్ తాజా మాటలతో అభిమానులకు ఆర్మీ అనే ప్రమోషన్ ఇవ్వటం ఓకే. కానీ.. ఆ మాటల్లో అండర్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.

తాను చెప్పానుకున్న విషయాన్ని తెలివిగా అల్లు అర్జున్ చెప్పారా? అన్నది క్వశ్చన్. ఎందుకంటే.. ఏడాదిన్నరకు పైనే సినిమాలేమీ చేయకుండా ఉన్నప్పటికీ.. తన మీద అభిమానాన్ని ఏ మాత్రం తగ్గించుకోకుండా.. తన సినిమా కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న వారిని ఉత్త అభిమానులుగా చెప్పటం ఇష్టం లేక.. ఆర్మీగా పేర్కొన్నారని చెప్పాలి.

అభిమానులు అభిమానాన్ని మాత్రమే ప్రదర్శిస్తారు. అంతకు మించిన ఎక్కువ ఆశించలేం. కానీ..ఆర్మీ అంతకు వందల రెట్లు కమిట్ మెంట్ ప్రదర్శిస్తారు.అంతేనా.. దేనికైనా.. ఎంతకైనా సై అంటే సై అన్నట్లుగా వ్యవహరిస్తుంది. తన ఫ్యాన్ ఆ కోవకు చెందినోళ్లన్న విషయాన్ని తన మాటలతో అల్లు అర్జున్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. ఏమైనా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ను ఆర్మీగా చెప్పుకునే తొలి హీరో బన్నీనే అని చెప్పాలి బాస్.
Please Read Disclaimer