స్టైలిష్ స్టార్ రెమ్యూనరేషన్ భారీగా ఉందిగా!

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత సినిమాపై హైప్ డబల్ అయింది. ముఖ్యంగా పాటలు ‘అల వైకుంఠపురములో’ క్రేజ్ ను పీక్స్ లోకి తీసుకెళ్లాయి.

సినిమా కు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. థియేట్రికల్.. నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి ఈ సినిమా దాదాపు 135 కోట్ల బిజినెస్ చేసిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్ కెరీర్లోనే ఇది హయ్యస్ట్ అని కూడా టాక్ ఉంది. మరి ఈ సినిమాకు అల్లు అర్జున్ ఎంత పారితోషికం తీసుకున్నారనేది అందరికీ ఆసక్తిని కలిగించే అంశం. ఈ సినిమాకు స్టైలిష్ స్టార్ 35 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని సమాచారం. మన తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. మొత్తం సౌత్ లోనే ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునేవారు అతి తక్కువమంది ఉంటారు. అల్లు అర్జున్ చివరి సినిమా ‘నాపేరు సూర్య’ ఫ్లాప్ గా నిలిచినప్పటికీ ఆ ప్రభావం స్టైలిష్ స్టార్ రెమ్యూనరేషన్ పై ఏమాత్రం లేదని చెప్పవచ్చు.

అల్లు అర్జున్ సరసన ఈ సినిమాలో బ్యూటిఫుల్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. టబు.. జయరామ్.. సుశాంత్.. నవదీప్..సముద్రకని.. సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. హారిక హాసిని క్రియేషన్స్.. గీతా ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
Please Read Disclaimer